Trends

డ్రోన్లను గాల్లోనే పట్టేసే గద్దలు.. ఆనంద్ మహీంద్రా ఫీదా

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణల గురించి తరచూ షేర్ చేసే ఆయన, తాజాగా తెలంగాణ గరుడ స్క్వాడ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణల గురించి తరచూ షేర్ చేసే ఆయన, తాజాగా తెలంగాణ గరుడ స్క్వాడ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు.

ఇది కేవలం ఒక సాధారణ వీడియో మాత్రమే కాదు, భవిష్యత్తులో అనుకోని ప్రమాదాలను నివారించేందుకు ఎంతో ఉపయోగకరమైన శిక్షణను చూపించే వీడియోగా మారింది. ఈ వీడియోలో గరుడ స్క్వాడ్‌కి చెందిన ప్రత్యేకంగా శిక్షణ పొందిన గద్దలు డ్రోన్లను గాల్లోనే పట్టేసి వాటిని నిర్వీర్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాదాపు 1 పౌండు నుండి 2 కిలోల బరువు గల డ్రోన్లను అదుపులోకి తీసుకురావడం కోసం ఈ ప్రత్యేక గద్దలకు శిక్షణ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది.

అనుమతి లేని డ్రోన్లు ‘నో-ఫ్లైయింగ్ జోన్’ల్లోకి ప్రవేశించినప్పుడు, వాటిని వెంటాడి అడ్డుకోవడానికి ఈ గరుడ స్క్వాడ్ సిద్ధమైంది. మహీంద్రా ఈ వీడియోను ట్విట్టర్ (X) వేదికగా పంచుకుంటూ, “టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి శక్తుల ప్రాధాన్యత ఎప్పటికీ అలాగే ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ గద్ద గాల్లో ఎగురుతూ డ్రోన్‌ను తన పంజాల్లో ముట్టడించడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రత్యేకమైన జాలి అమర్చబడి ఉండటం వల్ల డ్రోన్‌ను మరింత చాకచక్యంగా పట్టుకునేలా తయారు చేశారు. ఇది యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తూ, భద్రత కోసం ఈ కొత్త శిక్షణ విధానం ఎంత ప్రభావవంతమో చూపిస్తోంది.

మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. “ఇదొక అద్భుత ఆలోచన” అంటూ ప్రశంసలు గుప్పిస్తుండగా, మరికొందరు “టెక్నాలజీతో పాటు ప్రకృతి ఆధారిత భద్రతా చర్యలు చాలా అవసరం” అని అభిప్రాయపడుతున్నారు. శత్రు దేశాలు డ్రోన్ల నియంత్రణ కోసం సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్నా, ప్రకృతి శక్తుల సహాయంతో అమలు చేయడం కొత్తదనంగా మారింది.

ప్రస్తుతం ఈ గరుడ స్క్వాడ్ శిక్షణ విధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఈ విధానం మరిన్ని రాష్ట్రాల్లోనూ అమలు అవుతుందా? లేదా అంతర్జాతీయ స్థాయిలోనూ దీనికి ఆదరణ దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, గరుడ స్క్వాడ్ శిక్షణపై ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ విస్తృతంగా వైరల్ అవుతోంది.

This post was last modified on January 30, 2025 10:34 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

37 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

54 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

1 hour ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

2 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago