Trends

అంతరిక్షంలో 7 నెలలు.. నడవలేక, కూర్చోలేక, పడుకోలేక!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన అనుభవాలను వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్ ద్వారా ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) చేరుకున్న ఆమె, కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లినా సాంకేతిక సమస్యల కారణంగా అనేక నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వాస్తవానికి, జూన్ 14నే భూమికి తిరిగి రావాల్సి ఉన్నా, సాంకేతిక లోపల కారణంగా నాసా మళ్లీ మళ్లీ వాయిదా వేస్తూ వచ్చింది.

ఇక ఇటీవల అప్‌డేట్‌లో సునీతా తన పరిస్థితిని వివరించారు, 7 నెలలుగా నడవలేదని, కూర్చోలేదని, పడుకోలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శూన్య గురుత్వాకర్షణ ప్రభావం వల్ల తన శరీరం తేలియాడుతూనే ఉందని, భూమిపై నడిచిన అనుభూతిని కూడా గుర్తు చేసుకోలేకపోతున్నానని, నడవడం ఎలాగో గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఓ హైస్కూల్ విద్యార్థులతో వర్చువల్ సెషన్‌లో మాట్లాడిన ఆమె, అంతరిక్ష ప్రయాణం అనేది శారీరకంగా ఎంతటి సవాళ్లు విసురుతుందో వివరణ ఇచ్చారు.

నాసా ఇప్పటి వరకు క్రూ-9 మిషన్ ద్వారా వారికి తిరుగు ప్రయాణం ఏర్పాట్లు చేయాలని భావించిందైనా, ఇప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని ప్రకటించలేదు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిలియనీరైన వ్యాపారవేత్త, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చేసిన తాజా పోస్ట్‌లో ట్రంప్ నాసా, స్పేస్ ఎక్స్‌లను వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

“అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను వీలైనంత త్వరగా భూమికి తీసుకురావాలని ట్రంప్ నన్ను కోరారు. మేము అలా చేస్తాము” అంటూ మస్క్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రీడమ్ అనే పేరుతో ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్ (క్రూ-10) ద్వారా సునీతా విలియమ్స్ సహా మరో వ్యోమగామిని భూమికి రప్పించే ప్రణాళిక వేగంగా అమలు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ టెక్నీషియన్లు ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేసి, చివరి దశ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం, మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ తొలి వారంలో ఈ మిషన్ విజయవంతంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్ తన శరీరం భూమికి ఎలా అలవాటుపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీర్ఘకాలం శూన్య గురుత్వాకర్షణ వాతావరణంలో ఉన్న వ్యోమగాములు భూమిపై తిరిగి అడుగుపెట్టినప్పుడు, వాళ్ల శరీర వ్యవస్థ ఎలాంటి మార్పులు ఎదుర్కొంటుందో, స్పేస్ ఎక్స్ మిషన్ ఎంత త్వరగా వారిని భూమికి తీసుకురాబోతుందో గమనించాల్సిన అంశంగా మారింది.

This post was last modified on January 30, 2025 12:44 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago