Trends

నానమ్మ కళ్లలో ఆనందం కోసం చంపేశారు!

నానమ్మ పెంచి పోషించిన పగ ఆధారంగా తమ చెల్లి భర్తను చంపేసిన ఇద్దరు మనవళ్లు…ఇప్పుడు నానమ్మతో కలిసి ఊచలు లెక్కబెడుతున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన గడచిన 3 రోజులుగా కలకలం రేపింది.

క్రైమ్ థ్రిల్లర్ మూనీని తలపించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సూర్యపేటలోని పిల్లలమర్రికి చెందిన కోట్ల నవీన్ రాజకీయంగా ఎదిగే దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలో అదే జిల్లాలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్డకొండ కృష్ణ పరిచయమయ్యాడు. బీ ఫార్మసీని మధ్యలోనే ఆపేసిన కృష్ణను నవీన్ తరచూ తన ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో కృష్ణకు… నవీన్ సోదరి భార్గవితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే కృష్ణ దళిత సామాజిక వర్గానికి చెందిన వాడు కాగా… నవీన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు. దీంతో విషయం తెలుసుకున్న నవీన్… కృష్ణను పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరించాడు.

కుర్ర వయసు కదా… నవీన్ మాటలు కృష్ణ లెక్క చేయలేదు. నవీన్ ఫ్యామిలీ అభిప్రాయాన్ని ధిక్కరించి భార్గవిని తీసుకెళ్లి గతేడాది ఆగస్టు 7న పెళ్లి చేసుకున్నాడు. ఆపై సూర్యాపేటలోనే ఈ కొత్త జంట కాపురం పెట్టారు. కులం తక్కువ యువకుడు తన మనవరాలిని పెళ్లి చేసుకున్నాడని నవీన్ నానమ్మ బుచ్చమ్మ కుతకుతలాడిపోయారట.

తమ కుటుంబ పరువు మంటగలిపిన కృష్ణను ఎలాగైనా మట్టుబెట్టాలని మనవళ్లు నవీన్, వంశీలకు నూరిపోసిందట. దీంతో నానమ్మ మాటను నెరవేర్చేందుకు మనవళ్లిద్దరూ తీర్మానించుకుని రంగంలోకి దిగిపోయారు.

కృష్ణ మర్డర్ కు పక్కా ప్లాన్ రచించిన నవీన్, వంశీలు… కృష్ణతో స్నేహం నెరపుతున్న మహేశ్ ను తమ బుట్టలో వేసుకున్నారు. మహేశ్ తోనే కృష్ణను నిర్జన ప్రదేశానికి రప్పించి ముగ్గురు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత నవీన్, వంశీలు కృష్ణ డెడ్ బాడీని తమ కారు డిక్కీలో వేసుకుని నేరుగా నానమ్మ వద్దకు వెళ్లారు.

కృష్ణ మృతదేహాన్ని చూసిన బుచ్చమ్మ తన పగ తీరినట్లుగా… మనవళ్ల భుజం తట్టారు. ఆ తర్వాత కృష్ణ బాడీని అక్కడికి సమీపంలోని మూసీ కాలువ పక్కన పడేసి వెళ్లిపోయారు. ఇంటి నుంచి వెళ్లి కృష్ణ తిరిగి రాకపోవడంతో భార్గవి పోలీసులను ఆశ్రయించింది.

కృష్ణ తండ్రి డేవిడ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు…కేవలం ఒకే రోజు వ్యవధిలో ఈ కేసును ఛేదించారు. కృష్ణ హత్యను పరువు హత్యగా పరిగణించి… ఈ హత్యలో మొత్తం ఆరుగురికి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు.

బుచ్చమ్మతో పాటు ఆమె కుమారుడు, భార్గవి తండ్రి సైదులు, నవీన్, వంశీ, మహేశ్, సాయిచరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో కృష్ణ డెడ్ బాడీని చూసి కూడా సాయి పోలీసులకు సమాచారం ఇవ్వలేదట. ఇక హత్యకు ముందు కృష్ణ స్కూటీ మీదే అతడిని మహేశ్ తీసుకెళ్లడం గమనార్హం.

This post was last modified on January 30, 2025 6:04 am

Share
Show comments
Published by
Kumar
Tags: Suryapet

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

56 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago