పరమ పవిత్రంగా సాగుతున్న మహా కుంభమేళాలో బుధవారం ఉదయం అపశృతి చోటుచేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చారు. అదే సమయంలో వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ జన సందోహంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నిత్యం కోటి మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ తరహా రద్దీని ముందుగానే ఊహించిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఫలితంగా 15 రోజులు దాటినా…ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే కుంభమేళా సాగుతోంది. వచ్చిన భక్తులు వచ్చినట్లుగానే పుణ్య స్నానాలు చేసి వెళుతున్నారు.
అయితే మౌని అమావాస్య నేపథ్యంలో బుధవారం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా ప్రయాగ్ రాజ్ వచ్చారు. మంగళవారం రాత్రికే కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకున్నట్లు సమాచారం. ఇలా ప్రయాగ్ రాజ్ చేరుకున్న వారంతా బుధవారం తెల్లవారుజాముననే పుణ్య స్నానాల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా భక్తులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. కొన్ని వర్గాలు అయితే 15 మంది చనిపోయారని చెబుతున్నాయి. అయితే మృతులు, గాయపడ్డ వారి సంఖ్యపై ఇప్పటిదాకా అదికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
ఇదిలా ఉంటే… తొక్కిసలాట గురించి తెలిసినంతనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేంద్రం అండగా ఉంటుందని, ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాని భరోసా ఇచ్చారు. మరోవైపు మౌని అమావాస్య నేపథ్యంలో తరలివచ్చిన వీఐపీల సేవలో అధికారులు తరించారని, ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు స్వాములు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంతాప సూచకంగా పుణ్య స్నానాలను నిలిపివేసుకుంటున్నట్లు అఖిల భారత అఖాడా పరిషత్ ప్రకటించింది.
This post was last modified on January 29, 2025 1:41 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…