సెంచరీతో త్రిష ప్రపంచ రికార్డ్అండర్-19 ప్రపంచ కప్ లో త్రిష అరుదైన రికార్డ్కౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. సూపర్ సిక్స్ స్టేజ్ లో వరుసుగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజు స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
తెలుగమ్మాయి గొంగడి త్రిష సెంచరీ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అండర్-19 మహిళల వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, బౌలింగ్ లోనూ రాణించి 3 వికెట్లు పడగొట్టి ఆల్ రౌండర్ గా తెలంగాణ అమ్మాయి త్రిష సత్తా చాటింది.
కేవలం 53 బంతుల్లోనే సెంచరీ బాదిన త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 110 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన త్రిష..చివరి ఓవర్ వరకు నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది.
మరో ఓపెనర్ కమలిని 42 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేసింది. ఈ విజయంతో టీమిండియా అమ్మాయిలు ఇప్పటికే సెమీస్ చేరుకున్నారు. త్రిష-కమిలిని జోడి తొలి వికెట్ కు 147 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.
209 పరుగుల లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ ఏ దశలోనూ పోరాడలేదు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 4, వైష్ణవి శర్మ 3, త్రిష 3 వికెట్లు తీశారు. జనవరి 31న మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates