ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలన్నీ.. అప్పటిదాకా అమల్లో ఉన్న పాత పద్దతులనే అమలు చేస్తూ వచ్చాయి. అయితే వారందరికీ భిన్నంగా సాగుతున్న మోదీ మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి…వాటిలో అవసరమైన మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా వన్ నేషన్… వన్ ఎలక్షన్ అన్న నూతన పద్ధతిపై ఇఫ్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెర లేసింది.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పద్థతి అమలులోకి ఎప్పుడు వస్తుందో కానీ.. దాని కంటే ముందుగా దేశమంతా ఒకే సమయపాలనను అమలు చేసేందుకు మోదీ సర్కారు దాదాపుగా సయామత్తమైంది. ఇందుకోసం వన్ నేషన్… వన్ టైమ్ పేరిట ఓ నియమావళిని రూపొందించి… దాని పై అభిప్రాయాలు వెల్లడించాలంటూ దేశ ప్రజలను కోరింది. ఈ నూతన విధానంపై వచ్చే నెల 14 దాకా ప్రజల నుంచి కేంద్రం అభిప్రాయాలను స్వీకరించనుంది. ఆ అభిప్రాయాలను క్రోడీకరించి… అంందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలా?… లేదంటే యాజిటీజ్ గా అమల్లో పెట్టొచ్చా?అన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది.
ఇక వన్ నేషన్.. వన్ టైమ్ పేరిట కేంద్రం రూపొందించిన ముసాయిదా విషయానికి వస్తే… దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఒకే సమయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలతో పాటుగా దేశాభివృద్ధిలో కీలకమైన వాణిజ్యం విషయంలోనే ఏకరీతి ప్రామాణిక సమయాన్ని వినియోగించాల్సి ఉంటుంది. వాణిజ్యం, సాధారణ పరిపాలనతో పాటుగా రవాణా, చట్టపరమై ఒప్పందాలు, ఆర్థిక కార్యకలాపాలతో సహా ప్రతి అంశంలోనూ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్ టీ)నే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఐఎస్ టీని వినియోగించి తీరాలి. దీనిని కాకుండా ఇతరత్రా సమయ పాలనను అమలు చేయడం కుదరదు. అంటే… ఓ అంశానికి సంబంధించి కశ్మీర్ లో ఏ ఐఎస్ టీని నమోదు చేస్తామో… కన్యాకుమారిలోనూ అదే సమయాన్ని నమోదు చేయాల్సి ఉంటుందన్న మాట.