బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ తో క్లోజ్ గా ఉన్నారన్న వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం జనై భోస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలలో సిరాజ్‌ను హైలెట్ చేయడమే. ఇటీవల జనై భోస్లే తన పుట్టిన రోజు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో సిరాజ్‌తో ఆమె క్లోజ్‌గా ఉన్న ఫొటో హైలెట్ అయ్యింది. ఆమె ఫొటోలు పోస్ట్ చేసి మూడు రోజులైనా ఇంకా ఈ గాసిప్స్ డోస్ తగ్గడం లేదు.
ఫోటోల్లో ఇతర సెలబ్రెటీల ఫొటోలు కూడా ఉన్నాయి. కానీ సిరాజ్, జనై సరదాగా నవ్వుతూ క్లోజప్ లో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా, జనై తన ఇన్‌స్టాగ్రామ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును మాత్రమే ఫాలో అవడం, మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. గతంలో ఆమె సిరాజ్ కోసమే పలు మ్యాచ్ లను వీక్షించేందుకు వచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఐపీఎల్ మెగా వేలంలో మహ్మద్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జనై భోస్లే గుజరాత్ జట్టును ఫాలో కావడం, ఆమెతో సిరాజ్ మధ్య ఉన్న సంబంధం గురించి రూమర్లు మరింతగా ఊపందుకున్నాయి.
వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని గమనించిన నెటిజన్లు, ఇది వారి ప్రేమకథను ధృవీకరిస్తుందేమో అని అనుమానిస్తున్నారు. అయితే, సిరాజ్ – జనై భోస్లే ప్రేమలో ఉన్నారా అనే అంశంపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు.
ఎటువంటి సమాచారం లేకుండా ఇటువంటి గాసిప్స్ షేర్ చెయ్యడం సబబు కాదు. ఈ రూమర్లు నిజమో కాదో స్పష్టత రావాలంటే, వారు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.
This post was last modified on January 26, 2025 10:51 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…