యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి హాట్ టాపిక్ గా మారింది. అడవి మల్లెలాంటి అందంతో అందరిని ఆకట్టుకోవటమే కాదు.. సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ పాపులర్ అయ్యింది.
ఆమెకు సంబంధించిన ఫోటోల్ని జాతీయ.. అంతర్జాతీయ మీడియా మొదలు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నాయి. ఆమె ఫోటోల్ని పోస్టు చేస్తే చాలు.. సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలకు చేరుకుంటోంది. ఇంత చేసిన ఆమెకు సొంత సోషల్ మీడియా ఖాతా లేదు. కానీ.. ఆమె పేరుతో ఖాతాలు తెరుస్తున్న వారు మాత్రం విపరీతంగా ఫాలోవర్లను పెంచేసుకుంటున్నారు.
రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సినిమా అవకాశం ఇస్తానని చెప్పటం తెలిసిందే. ఆమెను చూసేందుకు.. ఆమెతో సెల్పీలు దిగేందుకు పోటెత్తుతున్న జనాలతో ఆమె వ్యాపారిని గండి కొడుతోంది. ఆమెను చూసేందుకు వేలాదిగా వస్తున్నారే కానీ.. ఎలాంటి వ్యాపారం జరగట్లేదు. దీంతో వారి ఉపాధికి పెద్ద సమస్యగా మారింది. ఇది వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
దీంతో.. మోనాలిసా తండ్రి.. ఆమెను సొంతూరుకు (ఇండోర్) పంపేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఓకే.. ఇంతకూ ఈ మట్టిలోని వజ్రాన్ని గుర్తించింది ఎవరు? ఆమెకు ఇంతటి పాపులార్టీకి కారణం ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ నెల 13న మహా కుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగ్ రాజ్ చేరుకొని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే మోనాలిసాను.. మహా కుంభమేళా న్యూస్ కవర్ చేసేందుకు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ చానల్ ప్రతినిధి ఆమెను చూశారు.
ఆమెను ఇంటర్వ్యూ చేసి.. వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేశారు. అంతే.. ఆ వీడియోకు క్రేజ్ రావటం.. ఆమె అందం అందరిని విపరీతంగా ఆకర్షించింది. దీంతో దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమె ఫోటోలకు ఎగబడిన పరిస్థితి. దీంతో మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ.. ఆ మాటకు వస్తే మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మోనాలిసా. చివరగా.. ఈ అడవి మల్లెకు ఇప్పుడో కొత్త పేరు పెట్టేశారు. లియనార్డో డావిన్సీ పెయింటింగ్ మోనాలిసాతో పోల్చేస్తున్నారు. ఆమె అందం బాలీవుడ్ తారల కంటే పదుల రెట్లు అందంగా ఉంటుందని పొగిడేస్తున్నారు.
This post was last modified on January 23, 2025 10:24 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…