Trends

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు కిలోమీటర్లు లేదంటే పది కిలోమీటర్లు ఇలా.. మారథాన్ పేరుతో మనుషులు పరుగులు తీయటం తెలిసిందే. కానీ.. మనుషులు.. ఆ మనిషి క్రియేట్ చేసిన రోబోలు పాల్గొనే సిత్రమైన పోటీకి చైనా వేదిక కానుంది.

ఏప్రిల్ లో చైనా రాజధాని బీజింగ్ పరిధిలోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించే 21 కి.మీ. మారథాన్ లో డజన్లు కొద్దీ హ్యుమనాయిడ్ రోబోలు 12వేల మంది మానవ అథ్లెట్లతో పోటీ పడనున్నాయి.

అయితే.. ఈ పోటీల్లో మనిషి.. రోబో అన్న తేడా లేకుండా ఎవరైతే అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తారో వారు విజేతలుగా నిలవనున్నారు. మనుషులు కావొచ్చు.. రోబోలు కావొచ్చు.. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. ఈ మారథాన్ లో పాల్గొనే రోబోలను 20 కంటే ఎక్కువ కంపెనీలు డెవలప్ చేశాయి. మనుషుల మాదిరి కనిపించటానికి ఈ రోబోట్ లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ రోబోట్ లు తప్పనిసరిగా 0.5 నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉండాలి. కనీస హిప్ టు ఫుట్ ఎక్స్ టెన్షన్ 0.45 మీటర్లుగా ఉండాలి. రిమోట్ కంట్రోల్.. ఆటోమాటిక్ రోబోట్ లు సైతం ఈ పోటీలో పాల్గొనే వీలుంది. రోబోల పని తీరు సరిగా ఉండేందుకు వీలుగా.. వాటికి అవసరమైన బ్యాటరీలను ఆపరేటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. చైనా సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్ రోబోట్ గంటకు పది కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదని చెబుతున్నారు. గతంలోనూ ఇవి మారథాన్లలో పాల్గొన్నప్పటికి.. రియల్ రేసులో పాల్గొనటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మరీ.. పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

ఇంతకూ ఇదంతా ఎందుకు? చైనా ఇలాంటి పనుల్ని ఎందుకు చేస్తుందంటే దానికో కారణం లేకపోలేదు. చైనాలో పెద్ద వయస్కుల వారు పెరిగిపోయారు. దీంతో శ్రామికశక్తి తగ్గింది. దీంతో.. దేశం జనాభాపరమైన సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి వేళ.. ఇతర దేశాలతో పోటీ పడేందుకు అవసరమైన శ్రామిక శక్తిని రోబోట్ ల ద్వారా సిద్ధం చేసుకోవాలన్న ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రోబోట్ లను సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పాలి.

This post was last modified on January 22, 2025 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

19 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

55 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago