అగ్ర రాజ్యం అమెరికాకు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆదిలోనే అదిరిపోయే నిర్ణయాలతో యావత్తు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నారు. సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో దేశ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసిన మరుక్షణమే తనదైన శైలి దూకుడును మొదలుపెట్టిన ట్రంప్…ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా వైదొలగుతున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి ఎలాంటి ఆర్థికపరమైన సహకారం లభించదు. అంతేకాకుండా ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించే ఈ సంస్థ ఇకపై తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమెరికా విమర్శించే ప్రమాదం లేకపోలేదు. అంటే.. డబ్ల్యూహెచ్ఓ తీసుకునే ప్రతి నిర్ణయంపైనా ఇకపై వ్యతిరేక ప్రచారం జరుగుతుందన్న మాట. అంటే… అటు ఆర్థికంగానే కాకుండా ఇటు ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేసే విషయంలోనూ డబ్ల్యూహెచ్ఓ ప్రతిబంధకాలను ఎదుర్కోనుందన్న మాట.
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరిగ్గా వ్యవహరించలేదంటూ ట్రంప్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నాడు అమెరికా అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోయిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగే విషయంపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ట్రంప్ మరోమారు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో డబ్ల్యూహెచ్ఓ వ్యవహారంపై ఆయన వేగంగా నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా చాలా వేగంగా స్పందించింది. ఇదెక్కడి పద్ధతి అంటూ ట్రంప్ నిర్ణయాన్ని చైనా ఎండగట్టింది. ప్రపంచ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టే డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థల విషయంలో ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కూడా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైైదొలగినా…తాము మాత్రం ఆ సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓకు ఆర్థికంగా అండగా నిలుస్తామని, గతంలో కంటే కూడా అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తామని ఆయన తెలిపారు.
This post was last modified on January 21, 2025 5:21 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…