టిక్ టాక్… చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా రికార్డులకెక్కింది. చాన్నాళ్లుగా అగ్ర రాజ్యం అన్న ట్యాగ్ ను అలా అలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్న అమెరికా గుత్తాధిపత్యం సాగిస్తోందంటూ చైనా ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది.
ఈ వ్యాఖ్యలతో ఆ దేశం అమెరికాకు తాను యాంటీ అని కూడా చెప్పకనే చెప్పింది. ఇక ప్రపంచంలోని అన్ని దేశాల వ్యవహారాలను ఎప్పటికప్పుడు తనదైన లెన్స్ లతో చూసే అమెరికా… అవకాశం చూసి కత్తులు దూస్తూ వస్తోంది. టిక్ టాక్ విషయంలోనూ అమెరికా అదే చేసింది.
అయితే ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో టిక్ టాక్ కు తిరిగి అమెరికాలోకి ప్రవేశించాలనే ఆశలు కలిగాయి. అందుకు అనుగుణంగా ఆ సంస్థ కొన్ని చర్యలు కూడా చేపట్టినట్లు సమాచారం.
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ట్రంప్ సోమవారం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ మరుక్షణమే అమెరికా విఫణిలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటూ టిక్ టాక్ భావించింది. అయితే అందుకు ముందుగానే టిక్ టాక్ ఆశలను సజీవంగా ఉంచుతూ ట్రంప్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు.
టిక్ టాక్ లో 50 శాతం వాటాలను అమెరికా ప్రభుత్వానికి బదలాయించగలిగితే…దానిని దేశంలోకి అనుమతించేందుకు ఎలాంటి అవరోధం ఉండబోదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా టిక్ టాక్ ను ఆయన ఆకాశానికెత్తేశారు.
ఈ నేపథ్యంలో అమెరికాలోకి టిక్ టాక్ తిరిగి ఎంట్రీ ఇవ్వడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టిక్ టాక్ లో సగం మేర వాటా అమెరికాకు ఏ రీతిన బదలాయింపు జరుగుతుందన్నదే ఇప్పుడు అసలు సిసలు టాస్క్ గా మారిందని చెప్పాలి.
This post was last modified on January 20, 2025 12:51 pm
ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్…
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…