ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం, ఖగోళ ప్రేమికులకు విజువల్ ట్రీట్‌గా నిలుస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ఈ అద్భుత దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపిస్తాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందనే విషయం తెలిసిందే. జనవరి 25న ఈ గ్రహాల అమరిక గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
ఈ సందర్భంగా మెర్క్యురీ కూడా లైనప్‌లో చేరి ఈ ప్లానెట్ పరేడ్‌ను మరింత విశేషంగా మారుస్తుంది. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం, ప్లానెట్ పరేడ్ అంటే భూమి దృక్కోణం నుంచి అనేక గ్రహాలు ఒకే రేఖపై వరుసగా కనిపించడం. ఈ అరుదైన సంఘటనలో యురేనస్, నెప్ట్యూన్‌ను చూడాలంటే టెలిస్కోప్ అవసరం. అయితే శుక్రుడు, అంగారకుడు వంటి గ్రహాలను కేవలం కంటితో కూడా చూడవచ్చు. ఈ గ్రహాలు సూర్యుడి వైపున ఒకే అమరికలో కనబడతాయి.
ఈ అరుదైన ఖగోళ సంఘటనను వీక్షించాలంటే, సూర్యాస్తమయం తర్వాత చీకటిగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లడం మంచిది. సిటీ లైట్లకు దూరంగా పశ్చిమ హోరిజోన్‌తో కూడిన ప్రాంతం చూడటానికి అనువుగా ఉంటుంది. గ్రహాలను స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్‌లు లేదా టెలిస్కోప్‌తో చూడడం ఉత్తమం.
ఈ నెల 25తో పాటు ఫిబ్రవరి 2న కూడా ప్లానెట్స్ పరేడ్ కనిపించే అవకాశం ఉంది. అమెరికాలో న్యూయార్క్, హ్యూస్టన్ వంటి నగరాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ అద్భుతం వీక్షించవచ్చు.
This post was last modified on January 16, 2025 6:29 pm
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…