భారత జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను సితాంశు కోటక్ చేపట్టనున్నారు. ఇటీవల టీమిండియా వరుస పరాజయాలు చవిచూడటంతో కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ స్థానాన్ని పునఃపరిశీలించి, కొత్త మార్గదర్శకుడు అవసరమని నిర్ణయించింది. సితాంశు కోటక్ ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు.
2023లో ఐర్లాండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించిన కోటక్‌కి, కోచింగ్ రంగంలో విశేష అనుభవం ఉంది. అంతకుముందు, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన ఆయన, నాలుగేళ్లుగా ఇండియా-ఏ జట్టు పర్యటనలకు కీలక పాత్ర పోషిస్తున్నారు. 1992 నుండి 2013 వరకు సౌరాష్ట్ర జట్టు తరపున దేశవాళీ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించిన కోటక్ 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 8,061 పరుగులు చేశారు.
15 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలకంగా నిలిచారు. ఆటను వీడిన తర్వాత, కోటక్ కోచింగ్ వైపు దృష్టి సాధించి అనేక జట్లకు మెళకువలు నేర్పించారు. ఇకపోతే, ఇంగ్లండ్ మాజీ లెజెండ్ కెవిన్ పీటర్సన్ కూడా టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులో ఉన్నారని సమాచారం. ఇటీవల పీటర్సన్ తాను ఈ బాధ్యతలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రకటించారు.
టెస్టు క్రికెట్‌లో తన దూకుడుగా ఆడే శైలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పీటర్సన్, 104 టెస్టులలో 8,181 పరుగులు సాధించారు. అయితే, బీసీసీఐ చివరికి కోటక్‌నే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ మార్పులతో టీమిండియా పటిష్టమైన బ్యాటింగ్ కోచింగ్‌ను అందుకుంటుందేమో చూడాలి. ఇప్పటికే గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా, మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా, కొత్త బ్యాటింగ్ కోచ్ జట్టుకు ఎంతవరకు మద్దతు అందిస్తారో ఆసక్తిగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates