హిండెన్ బెర్గ్… ఈ పేరు వింటేనే పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు హడలిపోయాయి. అమెరికాకు చెందిన ఈ ఆన్లైన్ వార్త సంస్థ రాసిన కథనాలు ఆయా బహుళ జాతి సంస్థలకు ముచ్చెమటలు పట్టించాయి. ఇందులో భాగంగా… భారత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ అపర కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానీ ఆధ్వర్యంలోని ఆదానీ గ్రూప్ ను హిండెన్ బెర్గ్ వార్తలు బెంబేలెత్తించాయి. ఆదానీ గ్రూప్ ఏకంగా అక్రమాలకు పాల్పడుతోందంటూ హిండెన్ బెర్గ్ రాసిన వార్తలు యావత్తు ప్రపంచ వ్యాపారస్తులను భయపెట్టాయి.
ఇక సెబీ చీఫ్ మాధవి పూరి, ఆమె భర్త పైన బిందెను బెర్గ్ రాసిన కథనాలు భారత స్టాక్ మార్కెట్ ను షేక్ చేశాయని చెప్పాలి. ఈ వార్తల్లోనూ పెద్దగా నిజాలు లేవని ఆ తర్వాత దర్యాప్తులో తేలింది. మొత్తంగా సంచలనాలకు ప్రాధాన్యం ఇచ్చిన హిండెన్ బెర్గ్.. వాస్తవాలను రాయలేదన్న విషయం తేలిపోయిందన్న వాదనలు వినిపించాయి.
ఇలాంటి వార్తల నేపథ్యంలో గురువారం ఓ బాంబ్ లాంటి వార్త వినిపించింది. హిండెన్ బెర్గ్ తన కార్యకలాపాలన్నింటిని మూసివేస్తోందని ఓ సంచలన కథనం కనిపించింది. నేరుగా హిండెన్ బెర్గ్ చీఫ్ నాటే ఆండర్సన్ చెప్పినట్టుగా ఈ వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి పెద్ద కారణమేమీ లేదని… తాము అనుకున్నది చేసి చూపించమని చెప్పిన ఆండర్సన్… ఆ పని ముగిసిపోయిందని, అందుకే తమ కార్యకలాపాలకు స్వస్తి చెబుతున్నామని వెల్లడించారు. ఓ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా రాణించిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కాస్తంత ముందుగా… హిండెన్ బెర్గ్ కు తాళం పడిపోతుండటం గమనార్హం.
This post was last modified on January 16, 2025 11:47 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…