కొద్ది రోజుల క్రితం ఒక పాడ్ కాస్ట్ లో ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడిన ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు..మెటా అధినేత జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. సమన్లు పంపటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 2024లో జరిగిన ఎన్నికల్లో ఏ అధికార పార్టీ కూడా విజయం సాధించలేదని పేర్కొన్నారు.
అయితే.. జుకర్ చేసిన వ్యాఖ్యలు చాలా దేశాల్లో వాస్తవమే అయినా.. భారత్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. కొవిడ్ తర్వాత భారత్ తో సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయినట్లుగా జుకర్ పేర్కొన్నారు.
భారతదేశంలో ప్రజాస్వామ్య పద్దతిలో జరిగిన ఎన్నికల ప్రక్రియను అవహేళన చేసినట్లుగా.. భారత ప్రభుత్వంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.
2024లో జరిగినసార్వత్రిక ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని.. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం.. 220 కోట్ల వ్యాక్సిన్లు అందించటంతోపాటు.. కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయటం లాంటి అంశాల్ని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ.. జుకర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇదే విషయాన్ని ఎక్స్ లో పోస్టు పెట్టటం తెలిసిందే.
మరోవైపు.. జుకర్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఆయనపై చర్యలకు సిద్ధమైంది. ఇలాంటి వేళ.. మెటా స్పందించింది. భారత ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరింది. అనుకోకుండా జరిగిన పొరపాటుగా పేర్కొంటూ.. తమను క్షమించాలని కోరింది. జుకర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన పోస్టుకు స్పందించిన మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివానంద్ టుక్ రాల్.. ‘2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్నపార్టీలు మళ్లీ విజయం సాధించలేదంటూ మార్క్ చేసిన వాదన చాలా దేశాల్లో నిజమే.
కానీ.. భారత్ లో మాత్రం అందుకు బిననంగా జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. మెటాకు భారత్ అతి ముఖ్యమైన భాగస్వామి. ఈ దేశ క్రియేటివిటి ఫ్యూచరర్ లో మేమూ కీలక పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.
మెటా రంగంలోకి దిగిన భారత సర్కారుకు క్షమాపణలు చెప్పటం.. చెంపలేసుకోవటంతో ఈ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చిందని చెప్పాలి. అయితే.. భారతదేశంలోని రాజకీయాల గురించి మాట్లాడే వేళలో.. జుకర్ కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాన్ని తాజా ఎపిసోడ్ తో గుర్తించి ఉంటారని భావించాలి.
This post was last modified on January 16, 2025 7:38 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…