Trends

ప‌సిడి గ‌నిలో ప్రాణాలు పోయాయ్‌.. 200 మంది మృతి!

అది బంగారు గ‌ని! త‌వ్వుకుంటే సిరులే!! కాక‌పోతే.. ఎలాంటి అధికారిక ఉత్త‌ర్వులు లేవు. అయినా.. కొందరు పేద‌లు.. ఈ గ‌నుల్లోకి వెళ్లి అంతో ఇంతో బంగారం తెచ్చుకుని గుట్టుమ‌ట్టుగా విక్ర‌యించుకుని జీవితాలను పోషించుకుంటున్నారు.

ఇదంతా కొన్ని ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న‌దే. ఆయా గ‌నుల్లోని బంగారాన్ని ప్ర‌భుత్వం త‌వ్వించే అవ‌కాశం ఉన్నా.. ప్ర‌మాదాల కార‌ణంగా ఆయా గ‌నుల‌ను వ‌దిలేసింది. దీంతో అవి పేద‌ల‌కు వ‌రంగా మారాయి.

అయితే.. ఈ ప‌నిని నేరంగా భావించిన ప్ర‌భుత్వం వాటిని అనూహ్యంగా మూసేసింది. దీంతో అప్ప‌టికే బంగారం కోసం వెళ్లిన 500 మందికిపైగా పేద‌లు.. ఆక‌లి ద‌ప్పుల‌తో అల‌మటిస్తున్నారు. వీరిలో సుమారు 200 మందివ‌ర‌కు మ‌ర‌ణించి ఉంటార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేసింది.

వారిని త‌క్ష‌ణం బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన స‌ర్కారుకు శ‌వాలు త‌ప్ప‌.. జీవించి ఉన్న మ‌నుషులు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నార‌ని అర్థ‌మైంది.

ఎక్క‌డ?

పేద‌రికంలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ద‌క్షిణాఫ్రికాలో బంగారు నిక్షేపాలు అధికం. ఇవే ఆదేశానికి వ‌న‌రులు కూడా. అయితే.. కొన్ని గ‌నులు ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో వాటిని ప్ర‌భుత్వం నిలుపుద‌ల చేసింది. ఇక‌, వీటిలో ఉన్న బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ప‌లు రాష్ట్రాల పేద‌లు.. సాహ‌సోపేతంగా వీటిలో కి వెళ్లి అందిన బంగారాన్ని తెచ్చుకుని కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. ఇలా.. రెండు మాసాల కింద‌ట 500 మంది వ‌ర‌కు గ‌నుల్లోకి వెళ్లారు. ఈ విష‌యం తెలిసిన ప్ర‌భుత్వం వెంట‌నే గ‌ని మార్గాల‌ను మూసేసింది.

దీంతో లోప‌లికి వెళ్లిన వారు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోయింది. పైగా.. వారు ఏర్పాటు చేసుకున్న వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా అధికారులు కూల్చేశారు. ఇది మ‌రింత దారుణంగా మారిపోయింది. దీంతో లోప‌లికి వెళ్లిన వారికి ఆహారం, నీరు లేకుండా పోయింది. ఫ‌లితంగా వంద‌ల మంది చ‌నిపోయారు.

ఈ విష‌యం నెమ్మ‌దిగా వెలుగు చూడ‌డంతోపాటు రాజ‌కీయ ప‌క్షాల నుంచి కూడా తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం బాధితుల‌ను బ‌య‌ట‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, వంద‌ల కొద్దీ శ‌వాలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాగా.. కేవ‌లం ప‌ది మంది మాత్రం కొన ఊపిరితో బ‌య‌ట ప‌డ్డారు.

This post was last modified on January 15, 2025 1:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

1 hour ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

4 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

5 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

8 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

8 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

9 hours ago