Trends

పాక్ సుడి తిరిగింది: నదిలో 33 టన్నుల బంగారు నిల్వలు

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారు నిల్వల్ని గుర్తించారు. ఇక్కడ దగ్గర దగ్గర 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లుగా తేల్చారు.

వీటి విలువ మన రూపాయిల్లో రూ.18వేల కోట్లుగా చెబుతున్నారు. అదే పాకిస్థాన్ రూపాయిల్లో చెప్పాలంటే 600 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే అంశాన్ని జియెలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ కూడా వెల్లడించింది.

విపరీతంగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఇంధన ధరలతో సామాన్యుడి బతుకు బండి కష్టంగా మారిన పాక్ ప్రజలకు ఇటీవల కాలంలో వరుస ఉగ్రదాడులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వేళలో భారీగా బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్తలు వారికి కొత్త ఆశల్ని తీసుకొస్తోంది.

ఈ భారీ బంగారాన్ని వెలికి తీసేయటం ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయని.. దేశం మీద ఉన్న అప్పుల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. పాక్ కరెన్సీ విలువ కాస్త వపెరుగుతుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. బంగారు నిల్వలను వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించే అంశంపై తాము ఫోకస్ చేసినట్లుగా పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహాం హసన్ మురాద్ ప్రకటించారు. ఈ బంగారు నిల్వలు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్లుగా చెబుతున్నారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇంతకూ ఈ భారీ బంగారునిల్వలు ఎలా సాధ్యమయ్యాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. సింధు నది.. హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయని.. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడి ఉంటాయిన చెబుతున్నారు.

వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్లకు పేరుకుపోయి.. ఇప్పుడీ నిల్వలకు కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు.

This post was last modified on January 12, 2025 3:37 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

4 seconds ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

1 hour ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

1 hour ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

2 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

4 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

5 hours ago