భారత క్రికెట్ జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయంతో పునరావాసానికి వెళ్లనున్నాడు. ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌లో ప్రారంభమయ్యే టోర్నీకి ముందే బుమ్రా అందుబాటులోకి రాకపోవడం భారత బౌలింగ్ దళానికి దెబ్బగా మారింది.
టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా ఎలాంటి పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని ఆట తీరు వల్లే టీమిండియా ట్రోపి అందుకునే వరకు వెళ్లింది. అవసరమైన సమయంలో ప్రత్యర్థి జట్టు బలాన్ని దెబ్బతియగల సమర్థుడు బుమ్రా. భారత జట్టులో ప్రస్తుతం అత్యంత కీలక ఆటగాడు బుమ్రా. అలాంటి ఆయుధం దూరమైతే జట్టు సగం బలాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం, బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌ను మార్చి మొదటి వారం నాటికి మాత్రమే సాధించగలడు. దీంతో, భారత్ తొలి రెండు గ్రూప్ మ్యాచ్‌లు – ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్‌తో బుమ్రా లేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఉంది. అప్పటికి బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది.
ఈ నేపథ్యంలో, అతడిని తుది జట్టులో ఉంచాలా? రిజర్వ్ ఆటగాళ్లలో ఉంచాలా? అన్నదానిపై సెలక్టర్లు ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా, చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ప్రతిపాదిత జట్టును ఇప్పటికే ఐసీసీకి అందజేసింది. ఫిబ్రవరి 12 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. బుమ్రా లేకపోవడం, ముఖ్యంగా పాకిస్థాన్ వంటి బలమైన జట్టుతో తలపడే సమయంలో భారత బౌలింగ్‌ను ప్రభావితం చేయనుంది.
This post was last modified on January 12, 2025 10:45 am
తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. పండుగ పూట సొంతూరికి వెళ్లాలని భావిస్తున్న వారికీ ప్రయాణ కష్టాలు తప్పడం…
నటుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను ఎన్నింటినో సాధించారు. ఇప్పుడు అటు సినిమాలతో పాటుగా…
ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా చూశాక అధిక శాతం ప్రేక్షకులు షాక్ కు గురైన అంశం నానా హైరానా…
కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 69వ సినిమా భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం రెండు నెలలుగా జరుగుతూనే ఉంది.…
సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు…
ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి... కొత్తగా…