ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా చూశాక అధిక శాతం ప్రేక్షకులు షాక్ కు గురైన అంశం నానా హైరానా పాట లేకపోవడం. ఎక్కడో ఒక చోటు ఉంటుంది లెమ్మని ఎదురు చూస్తే ఎండ్ కార్డు దాకా రాకపోవడం చూసి నిరాశ చెందిన వాళ్ళలో అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ ఉన్నారు.
జనవరి 14 నుంచి జోడిస్తామని ప్రకటించారు కానీ మొదటి నాలుగు రోజులు ఎందుకు లేదనే అనుమానం అందరి మెదళ్లలో అలాగే ఉండిపోయింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ తనవైపు నుంచి క్లారిటీ ఇచ్చాడు. అసలు ఏ కారణంతో మంచి సాంగ్ తీసేయాల్సి వచ్చిందో వివరించాడు.
తన మాటల ప్రకారం గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు చరణ్, కియారా లవ్ ట్రాక్ కి ఎక్కువ స్కోప్ పెట్టారు. దానికి అనుగుణంగానే మంచి మెలోడీ ఉంటే బాగుంటుందని భావించి హైరానా కంపోజ్ చేసుకుని రికార్డు చేశారు. తీరా చిత్రీకరణ అయిపోయి ఫైనల్ కాపీ చూసుకునే టైంలో ఫ్లోకి ఇది తగదని అనిపించింది.
ఫస్ట్ హాఫ్ లో ధోప్, రామచ్చా సరిపోయాయి. రెండో సగంలో కొండదేవర, అరుగు మీద సందర్భానికి తగ్గట్టు సింకయ్యాయి. రామ్ నందన్ సీరియస్ గా సిఎంగా ఎంపికయ్యే సీన్ తర్వాత హైరానా అంటూ డ్యూయెట్ పెడితే భావ్యంగా ఉండదని భావించి లేపేశారు. దీంతో తెరమీద ఒక ఖరీదైన పాట మిస్ అయ్యింది.
మళ్ళీ దీని కోసమే జనం థియేటర్లకు మరోసారి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ అనిపించేలా ఉంటుందట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే విఎఫెక్స్, ఇతర సాంకేతిక సమస్యలు ఏవి లేకుండా హైరానా సిద్ధంగానే ఉందట. కాకపోతే పైన చెప్పిన నేపధ్యం వల్ల ఫ్యాన్స్ మిస్ అయిపోయారు.
ఇండియాలోనే మొదటి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన పాటగా దీని గురించి తమన్, శంకర్ గతంలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ, బిటిఎస్ వీడియో రెండు చేశారు. తీరా చూస్తే ఇప్పుడేమో అసలు పాటే లేదు. అయినా ఉంచితే అడ్డం వచ్చిందని రాస్తారు, తీసేస్తే ఇలా ఎందుక చేశారని నిలదీస్తారని, ఇదో ట్రిక్కి సిచువేషనని తమన్ చెప్పడం ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on January 11, 2025 11:19 pm
కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 69వ సినిమా భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం రెండు నెలలుగా జరుగుతూనే ఉంది.…
సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు…
ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి... కొత్తగా…
గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి సవాలక్ష కారణాలున్నాయి కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే మహా ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే పలు…
ఒక వ్యూహం కొన్ని దారులు ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రణాళిక వందల అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వాతావరణమే…