సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవాలన్నారు. ఇదేసమయంలో ఆయన సంక్రాంతికి-మానవ సంబంధాలకు కూడా లింకు పెట్టారు.
నేటి కంప్యూటర్ యుగంలో పరుగులు పెడుతున్న జీవన శైలికి.. పండుగలు బ్రేకులు వేస్తాయని.. తద్వారా మనం ఏంటో తెలుసుకునేందుకు మనకు ఈ పండుగలు గొప్ప అవకాశం ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగువారి సంక్రాంతికి మరింత ప్రాధాన్యం ఉందన్నారు.
సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ తమ సొంత ఊళ్లకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తద్వారా.. పుట్టిన నేల, పరిచయస్తులకు మనం మరింత చేరువ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇది మానవ సంబంధాలను మెరుగు పరుస్తుందన్నారు.
ప్రస్తుతం చదివింది ఒక ఊళ్లో అయితే.. ఉద్యోగాలు, ఉపాధులు చేసేది మరో ఊళ్లోనని చెప్పారు. దీంతో పుట్టిన ప్రాంతంలో ఉన్నవారితో దాదాపు సంబంధాలు తగ్గుతున్నాయన్నారు. ఇది మంచి విధానం కాదని.. పుట్టిన ప్రాంతంలోను, పెరిగిన ఊళ్లోనూ ఉన్న నలుగురితో పరిచయం పెంచుకోవడం ద్వారా ఆత్మీయతలు మరింత గుబాళిస్తాయన్నారు.
కలిమి లేములు, కష్టసుఖాలు కూడా అందరికీ తెలుస్తాయని, తద్వారా మానవ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. ఈ క్రమంలో తాను కూడా తన సొంత ఊరు వెళ్తానని, నారా వారి పల్లెలో(చంద్రగిరి మండలం) గడుపుతానని.. ఉన్న రెండు రోజులు చుట్టుపక్కల వారితో ఉంటానని. వారి కష్టసుఖాలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు.
సంక్రాంతి వేళ.. అందరూ ఇదే సూత్రాన్ని అవలంభిస్తే.. రాష్ట్రం యావత్తు సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇక, పీ-4 పథకానికి సంబంధించిన పత్రాలపైనా చంద్రబాబు చెప్పకొచ్చారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను పీ-4 విధానంలో చేపట్టనున్నట్టు తెలిపారు. నలుగురినీ ప్రోత్సహించేందుకు.. పీ-4 విధానం తీసుకువస్తామని చెప్పారు.
This post was last modified on January 11, 2025 9:08 pm
ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా చూశాక అధిక శాతం ప్రేక్షకులు షాక్ కు గురైన అంశం నానా హైరానా…
కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 69వ సినిమా భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం రెండు నెలలుగా జరుగుతూనే ఉంది.…
ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి... కొత్తగా…
గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి సవాలక్ష కారణాలున్నాయి కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే మహా ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే పలు…
ఒక వ్యూహం కొన్ని దారులు ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రణాళిక వందల అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వాతావరణమే…