ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి… కొత్తగా ఆదాయ మార్గాలు అంతగా లేవనే చెప్పాలి. అప్పటిదాకా ఉన్న ఆదాయాల్లో క్రమానుగత పెరుగుదల తప్పించి… కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. ఫలితంగా నిత్యం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలంలో పాలుపంచుకుంటూ అప్పులను సమకూర్చుకుంటూ… కష్టాల కడలిలో నావ మాదిరిగా ఏపీ ప్రయాణం సాగిస్తోంది.
కష్టాలు ఉన్నాయని ఖర్చులు ఆగవు కదా. పండుగలు రాకుండా ఉండవు కదా. అలాగే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. పండుగ కానుకలు ఏమీ లేవా? అంటూ అటు ఉద్యోగులతో పాటుగా ఇటు ప్రజలూ ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న ఖజానాను చూసి వారి సంబరాలను హరించడం సీఎం చంద్రబాబుకు అసలు ఇష్టమే లేదు.
ఫలితంగా కష్టమైనా ఓ మోస్తరు నిదులను సమకూర్చి… అందులోనే వివిధ విభాగాలకు కొంత మొత్తం చొప్పున సర్దుబాటు చేసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాత్రికి కసరత్తు పూర్తి చేశారు.
ఈ కసరత్తు మేరకు ఉద్యోగుల జీపీఎఫ్ కు రూ.519 కోట్లు, సీపీఎస్ కు రూ.300 కోట్లు, టీడీఎస్ కు రూ.265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవుల బకాయిల చెల్లింపు కోసం రూ.241 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.788 కోట్లు విడుదల చేసేందుకు ఉత్తర్వులు రెడీ అయ్యాయి.
ఇక గత ప్రభుత్వంలో వివిధ పనులు చేసి ఇప్పటికీ బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఈ పండుగ పూట అయినా తమను ఆదుకోవాలంటూ చిన్న కాంట్రాక్టర్లు చంద్రబాబును వేడుకున్నారు. దీంతో ఈ కోటాలో ఉన్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 కోట్లు, 651 కంపెనీల రాయితీ కోసం రూ.90 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, రైతుల కౌలు బకాయిల కోసం రూ.241 కోట్లను కేటాయించారు.
This post was last modified on January 11, 2025 8:41 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…