కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 69వ సినిమా భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం రెండు నెలలుగా జరుగుతూనే ఉంది. కానీ దాన్ని ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎవరూ ఎస్ అనలేని పరిస్థితి. తమిళ వెర్షన్ దర్శకుడు హెచ్ వినోత్ కూడా దాన్ని ఖండిస్తూ ఇటీవలే ఒక ఈవెంట్ లో మాట్లాడ్డంతో ఫ్యాన్స్ అనుమానం తీరిందనే అనుకున్నారు.
కానీ ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం మ్యూజికల్ ఫెస్ట్ వేడుకలో మరోసారి ఈ టాపిక్ పెద్ద చర్చకే దారి తీసేలా కనిపించింది. ఇందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టు విటీవీ గణేష్ చిన్నగా మాట్లాడుతూ పెద్ద బాంబు పేల్చారు.
అనిల్ రావిపూడిని మెచ్చుకోవడంలో భాగంగా పాత సంఘటన గుర్తు చేసుకుని విజయ్ భగవంత్ కేసరిని అయిదు సార్లు చూశాడని, వెంటనే అనిల్ రావిపూడిని పిలిపించి రీమేక్ చేయమని కోరితే సున్నితంగా తిరస్కరించి వచ్చాడని, అంతగా బాగా నచ్చేలా తీశాడని ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు.
మధ్యలో రావిపూడి ఎంతగా ఆయనకు సర్దిచెప్పి టాపిక్ డైవర్ట్ చేద్దామని చూసినా గణేష్ వినలేదు. ఆఖరికి యాంకర్ సుమ సైతం ఆపేయాలనే రీతిలో సంజ్ఞలు చేసినా లాభం లేకపోయింది. ఈ విషయం చెప్పే తీరాలని కంకణం కట్టుకున్న విటివి గణేష్ తాను అనుకున్నది పూర్తి చేసేదాకా వదలకపోవడం కొసమెరుపు.
అక్కడే ఉన్న అనిల్ రావిపూడి క్లారిటీ ఇస్తూ కలిసిన మాట వాస్తవమే కానీ అది వేరే విషయం గురించని, వాళ్ళుగా అనౌన్స్ చేసే దాకా దీని గురించి కామెంట్ చేయడం భావ్యం కాదని క్లారిటీ ఇచ్చాడు. తాను కలిసిన హీరోల్లో గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో విజయ్ అని చెబుతూ ముగించేశాడు.
ఏది ఏమైనా గణేష్ ప్రసంగించిన అయిదారు నిముషాలు టెన్షన్ తో స్టేజి అలా ఊగిపోయింది. దెబ్బకు ఈ వీడియో ఇప్పుడు తమిళ ట్విట్టర్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం మొదలయ్యింది. ఈ పరిణామంతో విజయ్ 69 దర్శక నిర్మాతలు ఔననో కాదనో ఏదో ఒకటి అధికారికంగా ప్రకటించినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on January 11, 2025 11:10 pm
ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా చూశాక అధిక శాతం ప్రేక్షకులు షాక్ కు గురైన అంశం నానా హైరానా…
సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు…
ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి... కొత్తగా…
గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి సవాలక్ష కారణాలున్నాయి కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే మహా ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే పలు…
ఒక వ్యూహం కొన్ని దారులు ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రణాళిక వందల అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వాతావరణమే…