పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్ కు రెండు ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టిన ప్రతిభావంతురాలు. ఇటీవలే వెంకట దత్తసాయి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతడూ తెలుగు వాడే.
ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే… శనివారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో సింధు తన భర్తతో కలిసి కనిపించింది. అంతేకాదండోయ్.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి షటిల్ కోర్టులో ఉల్లాసంగా కనిపించింది. రిజిజు పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
శనివారం ఉదయం 10 గంటల సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో సాయంత్రం 5 గంటల సమయానికి ఏకంగా లక్షకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇంకా ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. అయినా ఈ వీడియోలో అంతగా ఏముందన్న విషయానికి వస్తే… బీజేపీలో యమా యాక్టివ్ గా ఉండే రిజిజు పదేళ్లకు పైబడి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు కదా.
అయినా కూడా ఆయన సింధుకు ఏమాత్రం తగ్గకుండా షటిల్ ఆడుతున్నారు. రిజిజు కొట్టే షాట్లు అచ్చం షటిల్ ప్లేయర్లు కొట్టే షాట్ల మాదిరిగా…ఓ రకంగా చెప్పాలంటే ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ ఆడుతున్నట్లే ఆయన కనిపించారు. కసేపు రిజిజుతో కలిసి ఆడిన సింధు… మరికాసేపు రిజిజుకు పోటీగా ఆడింది.
ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సింధుతో ఆమె భర్త దత్తసాయి కూడా కనిపించారు. ఆట మధ్యలో నూతన దంపతులు ఇద్దరూ కేంద్ర మంత్రితో సరదాగా సంభాషిస్తూ కనిపించారు. ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లో భాగంగా ఇలా సింధు, దత్తసాయితో కలిసి బ్యాడ్మింటన్ ఆడానంటూ రిజిజు చెప్పుకొచ్చారు. సింధుతో మ్యాచ్ చాలా సరదాగా సాగిందని కూడా రిజిజు కామెంట్ చేశారు.
This post was last modified on January 11, 2025 6:29 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…