రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియాకు ఆడిన ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. తన దశాబ్ద కాలకాలం క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ, అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
క్రికెట్ పట్ల తన ప్రేమను, తనకు ఆ క్రీడ ఇచ్చిన అపార అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. “గత 20 సంవత్సరాలుగా క్రికెట్ మైదానంలో జీవితాన్ని గడిపాను. ఫాస్ట్ బౌలింగ్ నా మొదటి ప్రేమ. ఇవాళ మైదానాన్ని వీడుతున్నప్పటికీ, క్రికెట్ పట్ల నా ప్రేమ ఎప్పటికీ ఉండిపోతుంది,” అని తన సోషల్ మీడియా పోస్టులో ఆరోన్ భావోద్వేగంగా పేర్కొన్నాడు.
విజయ్ హజారే ట్రోఫీ ద్వారా 2010-11లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వరుణ్ ఆరోన్, 21 ఏళ్ల వయస్సులో తన గంటకు 150 కిమీ పైగా వేగంతో బౌలింగ్ సామర్థ్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 9 టెస్టులు, 9 వన్డేలు ఆడిన అతను, మొత్తం 29 వికెట్లను సాధించాడు. 2015లో దక్షిణాఫ్రికాపై బెంగళూరులో జరిగిన టెస్టు మ్యాచ్ వరుణ్ ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది.
దేశవాళీ క్రికెట్‌లో వరుణ్ 88 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 141 వికెట్లు, 95 టీ20 మ్యాచ్‌లలో 93 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో తొమ్మిది సీజన్‌లకు ప్రాతినిధ్యం వహించిన అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ వంటి జట్ల తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో అతని వేగవంతమైన బౌలింగ్ తరచుగా ప్రత్యర్థులకు సవాలు విసిరేది. ఇక వరుణ్ రిటైర్మెంట్ పట్ల టీమిండియా క్రికెటర్లు అతనికి విషెస్ అందిస్తున్నారు.
This post was last modified on January 11, 2025 9:04 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…