జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలు భారత క్రికెట్‌లో కీలక చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందులు పడడం వల్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అతని అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. వెన్నునొప్పి సమస్యపై న్యూజిలాండ్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ సచౌటెన్‌ను సంప్రదించినట్టు సమాచారం. బీసీసీఐ మెడికల్ టీమ్‌తో కలిసి బుమ్రా సమస్య తీవ్రతను అంచనా వేస్తున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బీసీసీఐ తుది జట్టుకు 15 మందిని ఎంపిక చేసే క్రమంలో బుమ్రా పేరు కూడా పరిశీలనలో ఉందని, అయితే అతని ఫిట్‌నెస్‌ను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తోంది. బుమ్రా పూర్తిగా కోలుకుని ఏకాగ్రతతో ఆటపైనే దృష్టి పెట్టాలన్న అభిప్రాయం సెలక్టర్లలో ఉంది. మున్ముందు ఆసక్తికర నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇక బుమ్రా ఛాంపియన్స్ ట్రోపికి అందుబాటులో లేకపోతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీమిండియా లో అత్యధిక వికెట్లు తీస్తున్న బౌలర్లలో బుమ్రా మొదటి స్థానంలో ఉన్నారు. మరోవైపు, జస్ప్రీత్ బుమ్రాపై కెప్టెన్సీ బాధ్యతలే అతని ఫిట్‌నెస్ సమస్యలకు కారణమవుతాయని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ వల్ల దృష్టి చెదరడంతో పాటు క్రికెట్‌లో దీర్ఘకాలం కొనసాగేందుకు ఇది అడ్డంకిగా మారుతుందని కైఫ్ వ్యాఖ్యానించాడు.
ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడమే కాకుండా వికెట్లు తీయడంలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించడమే బుమ్రాకు అసలైన లక్ష్యంగా ఉండాలని సూచించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనేది త్వరలో తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates