Trends

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు ఇకపై దొరకవు

మద్యం ప్రియులకు… ప్రత్యేకించి బీరు ప్రియులకు కింగ్ ఫిషర్ పేరు వింటే ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఆల్కహాల్ శాతాల్లో కాస్తంత తేడాలతో పలు రూపాల్లో లభించే కేఎఫ్ బీర్ల కోసం మద్యం ప్రియులు అర్రులు చాస్తూ ఉంటారు. అవి దొరికినంతనే… లొట్టలు వేసుకుంటూ మరీ ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి కేఎఫ్ బీర్లకు ఇప్పుడు తెలంగాణలో కరువు వచ్చేసినట్టేనని చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా కేఎఫ్ బీర్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఆ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తెలిపింది. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజీలకు రాసిన లేఖలో యూబీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

బీర్ల వినియోగంలో కేఎఫ్ బీర్లదే అగ్ర తాంబూలం. బీర్లలో ఎన్ని కంపెనీల బీర్లు ఉన్నా… కేఎఫ్ బీర్లకే మందుబాబులు ఓటేస్తున్నారు. ఫలితంగా కేఎఫ్ బీర్ల విక్రయాలు ఏటికేడు పెరెగుతూనే ఉన్నాయి. ఇరత రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా… తెలంగాణలో 2019 నుంచి బీర్ల ధరల్లో పెద్దగా మార్పేమీ లేదు. 2019లో బీర్ల రేట్లను పెంచగా…ఆ తర్వాత అప్పుడప్పుడూ ఇతరత్రా మద్యం రేట్లు పెరిగినా… బీర్ల రేట్లు మాత్రం పెరగలేదు. ఇదే విషయాన్ని యూబీ తన లేఖలో ప్రస్తావించింది. 2019 నుంచి బీర్ల రేట్లను తెలంగాణ సర్కారు పెంచలేదని, ఈ కారణంగా తమకు భారీ నష్టాలు వస్తున్నాయని ఆ సంస్థ తెలిపంది. ఈ కారణంగానే తెలంగాణకు తమ బ్రాండ్ బీర్లను నిలిపివేస్తున్నట్లు యూబీ వెల్లడించింది.

మరోవైైపున కేఎఫ్ బీర్లకు సంబంధించి తెలంగాణ సర్కారు యూబీకి భారీ ఎత్తున బకాయిలు పడిందట. చాలా కాలంగా బీర్లను తీసుకుంటున్న తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్… వాటికి చెల్లించాల్సిన బిల్లులను మాత్రం చెల్లించడం లేదట. ఈ కారణంగా తకు రావాల్సిన బకాయిలు అమాంతం పెరిగిపోయాయని యూబీ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వైపున ఐదేళ్లుగా బీర్ల ధరలను పెంచకపోవడం, మరోవైపున పేరుకుపోయిన బకాయిల కారణంగానే… కష్టమైనా తెలంగాణకు బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ఇక్కడ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకోవాలి. తెలంగాణతో పాటుగా, ఏపీ, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు పంపిణీ అవుతున్న కేఎఫ్ బీర్లన్నీ తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కు హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని సంగారెడ్డి పరిసరాల్లో 2 బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న బీర్లను యూబీ… తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. తాజాగా ఆ సంస్థ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న కేఎఫ్ బీర్లు ఆ రాష్ట్ర ప్రజలకే దొరకకుండా పోతున్నాయి. వెరసి యూబీ తీసుకున్న నిర్ణయంతో మందుబాబులు గగ్గోలు పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

This post was last modified on January 9, 2025 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

6 hours ago