అతడి వయసు 35 ఏళ్ల కంటే తక్కువే. అయితే.. టెక్నాలజీ మీద తనకున్న పట్టుతో ఈ భారత సంతతికి చెందిన యువకుడు తన కంపెనీని రూ.8వేల కోట్లకు పైనే అమ్మేశాడు. అంత సంపాదించిన వ్యక్తి ఇప్పుడెలా ఉంటాడు? అన్న ప్రశ్నకు దర్జాగా ఉంటాడని అనుకోవచ్చు. అలా అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే.
ఎందుకంటే.. తనకు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ అతను పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. తీవ్ర చర్చకు తెర తీసింది. ఇంతకూ అతడి పేరేమిటి అంటే.. వినయ్ హిరేమత్. టెక్ సంస్థ లూమ్ ను స్థాపించిన ఇతను చాలా తక్కువ కాలంలోనే విజయాన్ని సాధించాడు.
గత ఏడాది తన సంస్థను అట్లాసియన్ సంస్థకు అమ్మేశాడు. ఆ అమ్మకం ద్వారా అతనికి వచ్చిన సంపద మన రూపాయిల్లో రూ.8వేల కోట్లకు పైనే. ఇదంతా 35 ఏళ్ల కంటే తక్కువ ప్రాయంలోనే సొంతం చేసుకున్నాడు. ఇంత భారీ సక్సెస్ తర్వాత.. అతను ఫుల్ ఎంజాయ్ చేస్తూ.. రెట్టింపు ఉత్సాహంతో కొత్త ప్రణాళికలు రచిస్తూ ఉంటాడని అనుకుంటున్న వారికి.. ఊహించలేని షాకిచ్చాడు.
తాను ధనవంతుడిని అయ్యానని.. అయితే ఇప్పుడేం చేయాలో తనకు తెలియటం లేదన్నారు. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పటికి ఒక సందిగ్థంలో తాను ఉన్నానని.. జీవితంపై అంత సానుకూలంగా ఏమీ లేనని పేర్కొన్నారు. తాను పెడుతున్న ఈ పోస్టు ఎవరి సానుభూతి కోసమో కాదని.. ఆ మాటకు వస్తే ఏ ఉద్దేశంతో తాను ఈ పోస్టు రాస్తున్నానో కూడా తనకు తెలీదని పేర్కొనటం గమనార్హం.
తన కంపెనీని అమ్మేసిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి జర్నీలు చేయటం మొదలుపెట్టాడట. ఎన్నో ప్రాంతాల్ని తిరిగేసిన తర్వాత తనకున్న అభద్రతాభావంతో ఆమెతో విడిపోయినట్లుగా పేర్కొన్నారు. ‘ఆమె ఈ పోస్టు చదువుతున్నట్లయితే.. నేను సారీ చెప్పాలనుకుంటున్నా. నీకు కావాల్సిన విధంగా నేను ఉండలేకపోయాను. నీవు అందించిన అనుభూతులకు థ్యాంక్స్’ అంటూ తన బ్లాగ్ లో రాసుకున్నాడు.
తన సంస్థను అమ్మేసిన కంపెనీలోనే ఏడాదికి 60 మిలియన్ డాలర్ల ప్యాకేజీకి జాబ్ ఆఫర్ చేసినా.. వినయ్ నో చెప్పారు. రోబెటిక్ సంస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నం నిరాశే మిగిల్చిందని చెప్పారు.
అదే విధంగా ఎలాన్ మస్క్.. వివేక్ రామస్వామి లాంటి వారితో పని చేయాలని తాను అనుకున్న ప్రయత్నం ముందుకు సాగలేదన్న అతను.. ప్రస్తుతం హవాయి ద్వీపంలో ఫిజిక్స్ నేర్చుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దానికి సంబంధించిన అంశాలపై తాను ఇప్పుడు ఫోకస్ చేసినట్లుగా చెప్పిన వినయ్ మాటలు.. అతడి పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
అతడి పోస్టును చదివినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.. అతను తన గర్ల్ ఫ్రెండ్ ను మిస్ చేసుకోవటమే కాదు.. ఆమె లేకపోవటం అతడి తీవ్రమైన లోటుగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ విషయం వినయ్ కు ఇప్పటికైనా అర్థమైందో? లేదో?
This post was last modified on January 7, 2025 3:26 pm
పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే.…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సంపూర్ణ భరోసా ఇస్తూ…
టీడీపీ-బీజేపీ నేతల మధ్య వివాదాలు తెరమీదికి వచ్చాయి.. సర్దుకునే ప్రయత్నం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. సాధారణంగా…
ఇటీవలే చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అభిమానులు కాని వాళ్ళు…
దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందుగా వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. స్టార్ హీరోల…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు మరింతగా ప్రాధాన్యం పెరిగింది. బుధవారం…