సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని జనం చెప్పుకునేలా చేసిందా మహమ్మారి. ఆ మాయదారి వైరస్ చేసిన గాయాల నుంచి కోట్లాది కుటుంబాలు ఇంకా కోలుకోకముందే తాజాగా మరో వైరస్ ప్రపంచంపై పంజా విసిరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
కరోనా మాదిరిగా చైనాలో పుట్టిన హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ ఎంపీవీ) కేసులు ఆ తర్వాత మలేషియాలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ మహమ్మారి వైరస్ భారత్‌కూ పాకినట్లు కనిపిస్తోంది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు జాతీయ మీడియా నుండి కథనాలు వస్తున్నాయి. అయితే, ఓ ప్రైవేటు ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జాతీయ మీడియా కథనాలు రాసిందని కర్ణాటక ఆరోగ్య శాఖ చెబుతోంది.
ఆ రిపోర్ట్ పై తమకు అనుమానాలు లేవంటూనే…రాష్ట్రంలోని ల్యాబ్ లో ఆ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ కేసుపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది. హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన ప్రమాదకరమైన వైరస్. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులను ఇది టార్గెట్ చేస్తుంది.
సాధారణ ఫ్లూ మాదిరిగానే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఈ వైరస్ సోకినవారిలో కనిపిస్తాయి. ఈ వైరస్ తీవ్రత ఎక్కువైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చే అవకాశముంది.
This post was last modified on January 6, 2025 12:27 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…