Trends

ఫైనల్ గా రిటైర్మెంట్ పై నోరు విప్పిన హిట్ మాన్

సిడ్నీ టెస్టు సందర్భంగా భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా హిట్ మాన్ రోహిత్ టెస్ట్ ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు అనేక రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అలాగే వన్డే ఫార్మాట్ కు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు కూడా నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక ఫైనల్ గా రోహిత్ మౌనం వీడి వాటన్నిటిపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జట్టులో తగిన మార్పులు అవసరమని, వ్యక్తిగత ప్రయోజనాలకంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.

సిడ్నీ టెస్టులో ఎందుకు ఆడలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, అది జట్టు అవసరాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని, విశ్రాంతి తీసుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం కాదని రోహిత్ స్పష్టం చేశారు. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం చేసిన నేపథ్యంలో, ఆ జోడీని మార్చడం సరైనదేమీ కాదని చెప్పిన రోహిత్, ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను కొనసాగించడమే మంచిదని భావించామని వివరించారు.

కీలక టెస్టులో తాను ఆడకపోవడం సున్నితమైన నిర్ణయమే అయినప్పటికీ, జట్టు విజయం కోసం ఈ నిర్ణయం తప్పనిసరని చెప్పారు. ఫామ్ లేకపోవడం తాత్కాలికమేనని, మరింత కష్టపడి మంచి ప్రదర్శన చేయాలనే సంకల్పంలో ఉన్నానని రోహిత్ అన్నారు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి స్లెడ్జింగ్ వచ్చినా, భారత ఆటగాళ్లు పరిమితంగానే స్పందిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా, కొన్‌స్టాస్ – బుమ్రా వాగ్వాదం విషయమై టీమిండియా సభ్యులు శాంతి పాటించారని పేర్కొన్నారు.

తన రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లపై స్పందిస్తూ, అటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచన చేసుకుంటానని, ఎవరి ఒత్తిడికీ లోనుకాకుండా తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని రోహిత్ చెప్పారు. రాబోయే ఐదు నెలల్లో రోహిత్ మరోసారి తన ఫామ్‌ను కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

This post was last modified on January 4, 2025 11:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

9 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago