Trends

USA: భారతీయులను భయపెడుతున్న ఓపీటీ రచ్చ

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్‌1బీ వీసాలు పొందేందుకు ఈ ప్రోగ్రామ్‌ వారికి తొలి మెట్టుగా మారింది. ప్రతీ ఏడాది ఎక్కువ సంఖ్యలో యూఎస్ కు వెళుతున్న విద్యార్థులలో భారతీయులు కూడా ఉన్నారు. అయితే అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వాడుతున్న ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌పై విమర్శలు తీవ్రంగా పెరుగుతున్నాయి.

విద్యార్థులకోసం ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్‌ దేశీయ ఉద్యోగాలపై ప్రభావం చూపుతోందని, స్థానిక అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఓపీటీ కింద ఎఫ్-1 వీసా విద్యార్థులు మూడేళ్లపాటు పని అనుభవం పొందవచ్చు. అయితే, దీన్ని విద్యార్థులు వలస విధానానికి వేదికగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఓపీటీ ప్రోగ్రామ్‌ నిర్వహణకు అమెరికా కాంగ్రెస్‌ అనుమతి లేదని, ఇది ఆ దేశ చట్టాలకు విరుద్ధమని కొన్ని వర్గాలు అంటున్నాయి. విదేశీ విద్యార్థులు అమెరికన్‌ ఉద్యోగాలతో పోటీపడటం వలన స్థానిక టెక్ వర్కర్లకు అవకాశాలు తగ్గుతున్నాయని వారంటున్నారు. టెక్ వర్కర్స్ గ్రూప్ ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, విదేశీ విద్యార్థులకు విద్యాశాఖలు వర్క్ పర్మిట్‌లు విక్రయిస్తున్నాయని ఆరోపించింది.

ఓపీటీపై ఉన్న వివాదాలు ఇలానే కొనసాగితే, భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారే అవకాశముంది. ఇప్పటికే విదేశీ విద్యార్థుల ఉద్యోగ పోటీని సమర్థించుకున్న న్యాయస్థానం ఓపీటీని సమర్థించినప్పటికీ, కొందరు చట్టసభ సభ్యులు దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ చట్టసభలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ట్రంప్‌ అనుచరులు దేశీయ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ ఈ ప్రోగ్రామ్‌ను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ విధానం భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి.

This post was last modified on January 3, 2025 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీలో నారా లోకేశ్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం…

14 minutes ago

శ్రీ ఆంజనేయం వెనకున్న ‘చిరు’ రహస్యం

అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉందన్నట్టు ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఒకరితో అనుకున్నది మరొకరితో…

19 minutes ago

వైఎస్ వద్దే తగ్గలేదు… ఇప్పుడు తగ్గుతానా?: దానం

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన… 2023 ఎన్నికల్లో…

2 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ఫ‌స్ట్ ప‌ని ఇదే.. వైసీపీ నేత‌ల డిమాండ్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని తాడేప‌ల్లికి చేరుకున్నారు. సుమారు 15-20 రోజుల పాటు ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు…

3 hours ago

ప్రశాంత్ వర్మ మాటల్లో మర్మం ఏమిటో

హనుమాన్ బ్లాక్ బస్టర్ రిలీజై ఏడాది దాటేసింది. ఇప్పటిదాకా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా మొదలుకాలేదు. జై హనుమాన్…

3 hours ago

వీరమల్లు రాక…. ఎవరికి లాభం ఎవరికి కష్టం!

పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదల మార్చి 28 అని టీమ్ పదే పదే…

4 hours ago