ప్రముఖులకు సంబంధించి విషయాలు తరచూ చర్చకు వస్తూ ఉంటాయి. మీడియాకు మించి సోషల్ మీడియా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అవసరం లేని విషయాల మీద చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కొన్ని అబద్ధాల్ని అందమైన నిజాలుగా చూపించే సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది నిజం? అన్నది తెలుసుకోవటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది.
దేశీయంగా సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ వినియోగించే ఐఫోన్ ముచ్చట తరచూ జరుగుతుంటుంది. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ గా అంబానీ ఫ్యామిలీకి ఒక ఇమేజ్ ఉంది. ఆడంబరాల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. దీంతో.. వారికి సంబంధించిన కొన్ని అబద్ధాలు నిజాలుగా ప్రచారం జరుగుతుంటాయి. ఆ కోవలోకే వస్తుంది ఈ నీతా అంబానీ వద్ద ఉన్న వందల కోట్ల రూపాయిల విలువ చేసే ఐఫోన్.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ నీతా అంబాని వద్ద ఉన్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. దీనికి కారణం నీతా అంబానీ వద్ద ఉన్న ఐఫోన్ వెనుక బంగారంతో పాటు.. ఖరీదైన పింక్ డైమండ్ ఉందని.. దాని విలువ రూ.403 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతూ ఉంటుంది.అయితే.. దీనికి సంబంధించి రిలయన్స్ వివరణ ఇవ్వటమే కాదు.. ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన ఇండియా టుడే సైతం.. అలాంటి ఫోన్ ను నీతూ అంబానీ ఎప్పుడు వాడలేదని తేల్చేసింది.
అదే సమయంలో..ఆమె ధరించే దుస్తుల అంశం చర్చకు వచ్చింది. ఇటీవల ఆమె ముంబయిలోని ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ఓపెనింగ్ కు వచ్చిన ఆమె.. ఒక డ్రెస్ ను ధరించారు. అది పలువురిని ఆకర్షించింది. సోషల్ సర్కిల్స్ లో హాట్ చర్చగా మారిన ఆమె ధరించిన వైట్ సిల్క్ టాప్ ఖరీదైనదిగా లెక్క తేల్చారు. దాని ధర మన రూపాయిల్లో రూ.1.18 లక్షలుగా చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర కూడా ఆమె వద్ద ఉందని.. దాని ధర రూ.40 లక్షలు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ 20 సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ సతీమణి అన్న తర్వాత ఆ మాత్రం ఉండొద్దా?
This post was last modified on December 29, 2024 4:16 pm
2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది.…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు…
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయన కుమారుడు, ఆయన కోడలు బ్రాహ్మణి…
2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలకు సంబంధించి…