ఘోర విషాద ఉదంతం వెలుగు చూసింది. అమెరికాలో పదకొండు మంది భారతీయులు అనుమానాస్పద రీతిలో మరణించారు. జార్జియాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. స్కై రిసార్ట్ గా ఫేమస్ అయిన గూడౌరిలోని రెస్టారెంట్ లో పని చేసే పన్నెండు మంది సిబ్బంది అనుమానాస్పద రీతిలో మరణించారు. వీరిలో పదకొండు మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ షాకింగ్ ఉదంతాన్ని భారతీయ అధికారులు ధ్రువీకరించారు.
ఘటన జరిగిన హోటల్లో వారంతా సిబ్బందిగా ఉన్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనను అత్యంత దురదృష్ట ఘటనగా భారత రాయబార కార్యాలయం రియాక్టు అయ్యింది. మృతులకుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన రాయబార కార్యాలయం వారి మృతదేహాల్ని సాధ్యమైనంత త్వరగా వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.
అయితే.. ఈ దారుణ ఉదంతం ఈ నెల పద్నాలుగున చోటు చేసుకుందని.. మరణించిన వారి మీద దాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని.. శరీరం మీదా గాయాలు లేవని అమెరికా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితులంతా కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే చనిపోయారని.. రెస్టారెంట్ లోని సెకండ్ ఫ్లోర్ లో డెడ్ బాడీలు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ మరణాల్ని అనుమానాస్పద మరణాలుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బాధితుల బెడ్రూం గదులకు దగ్గర్లోనే ఒక పవర్ జనరేటర్ ను గుర్తించారు. విద్యుత్ సరఫరా ఆగటంతో జనరేటర్ ను అక్కడ ఏర్పాటు చేశారని.. దాని పొగ కారణంగానే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. శాస్త్రీయంగా తేల్చేందుకు ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేశారు. ఆ రిపోర్టు వస్తే ఈ మరణాలకు కచ్ఛితమైన కారణాలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నారు. ఈ తరహా మరణాలు ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదన్న అభిప్రాయాన్ని అక్కడి మీడియా సంస్థలు పేర్కొనటం గమనార్హం.
This post was last modified on December 17, 2024 2:00 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…