ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో కొత్త ఈమెయిల్ సేవను ప్రారంభించేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్స్ మెయిల్’’ సృష్టిస్తే ఎలా ఉంటుంది?’’ అని ఓ యూజర్ చేసిన సూచనకు మస్క్ స్పందిస్తూ, ‘‘ఇది జీమెయిల్, ఇతర ఈమెయిల్ సేవలకు కఠినమైన పోటీని కల్పిస్తుంది’’ అని చెప్పారు.
ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్‌లో యాపిల్ మెయిల్ 53.67% తో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, గూగుల్ జీమెయిల్ 30.70% తో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని అవుట్‌లుక్, యాహూ మెయిల్ వంటి ఇతర సర్వీసులు దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ మెయిల్ ప్రవేశం మరింత పోటీతత్వాన్ని తీసుకురానుందని నిపుణులు భావిస్తున్నారు.
మస్క్ ఇప్పటికే ఎక్స్ (మాజీ ట్విట్టర్) ద్వారా టెక్ ప్రపంచంలో ప్రాధాన్యతను స్థిరపర్చారు. ఇప్పుడు ‘‘ఎక్స్ మెయిల్’’ ప్రవేశపెట్టడం ద్వారా మరిన్ని విభాగాల్లో విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. వినూత్నమైన సాంకేతికతలతో ఇది ఈమెయిల్ సేవల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించే అవకాశం ఉందని ఆభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, ‘‘ఎక్స్ ఫోన్’’ వంటి సరికొత్త ప్రాజెక్టులపై యూజర్ల నుంచి ప్రేరణ లభిస్తుండటం గమనార్హం. ఎక్స్ మెయిల్, ఎక్స్ ఫోన్ లాంటి ప్రణాళికలతో టెక్ దిగ్గజాలకు మస్క్ భారీ పోటీ ఇవ్వనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రణాళికలు ఎలా అమలు జరుగుతాయో టెక్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
This post was last modified on December 16, 2024 6:56 pm
సామాన్యులకు తట్టని అర్థం కాని విధంగా సినిమాలు తీసినా అన్ని వర్గాలను మెప్పించడం ఉపేంద్ర స్టైల్. 'ఏ'తో దాన్ని ముప్పై…
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34…
బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…
క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ…
తెలంగాణ అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం చర్చల మధ్య తీవ్ర అభ్యంతరాలతో ముగిసింది. సభకు సంబంధించిన రోజులను…