దేశంలో ప్రతిపక్షాలపై కత్తికట్టినట్టు వ్యవహరించి.. మార్షల్ లా(సైనిక పాలన)ను తీసుకువచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. అభిశంసనకు గురయ్యారు. ఆయనను ఆ పదవి నుంచి దింపేస్తూ.. పార్లమెంటు చేసిన తీర్మానానికి ఏకంగా 204 మంది సభ్యులు మద్దతు తెలిపారు. మొత్తం పార్లమెంటులో 300 మంది సభ్యులు ఉండగా.. 204 మంది మద్దతు తెలపడంతో ఆయన పదవీచ్యుతలయ్యారు. అయితే.. ఆయన ఇప్పటికిప్పుడు ఆ పదవి పోయే ప్రమాదం లేక పోవడం గమనార్హం. తాజాగా శనివారం పార్లమెంటులో తీర్మానం ఆమోదం పొందినా.. 180 రోజుల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు.
కాకపోతే.. అధికారాలు మాత్రం సన్నగిల్లుతాయి. ఇక, పార్లమెంటు చేసిన తీర్మానాన్ని.. దక్షిణ కొరియా సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేయనున్న(దీని కోసమే) రాజ్యాంగ ధర్మాసనానినికి ఈ తీర్మానం కాపీలను పంపిస్తారు. ఈ ధర్మాసనం.. అన్ని కోణాల్లోనూ విచారించి.. రాజ్యాంగం ప్రకారం తీర్మానం ఆమోదం పొంది ఉందని నిర్ధారించాల్సి ఉంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా.. ధర్మాసనం..ఈ తీర్మానాన్ని రద్దు చేయొచ్చు. దీనికిగాను 180 రోజులసమయం ఇస్తారు. ఒకవేళ ధర్మాసనం కనుక తీర్మానాన్ని ఆమోదిస్తే.. తదుపరి 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించి.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
ఇదిలావుంటే.. ప్రస్తుత యోల్ పదవీచ్చుతులు కావడంతో ఆయన అధికారాలను ప్రస్తుత ప్రధానికి తాత్కాలికంగా అప్పగించా రు. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు.. ప్రధానే అధ్యక్షుడిగా కొనసాగుతారు. మరోవైపు.. యోన్ పదవీచ్చుతుడు కావడంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. అనేక సంస్థలు.. కూడా తమ ఉద్యోగులకు మిఠాయిలు పంచాయి. సోమవారం కూడా సెలవు ప్రకటించాయి. ప్రతిపక్ష పార్టీలు తమ తమ కార్యాలయాల ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నాయి. ఈ సంబరాల్లో అధికార పార్టీ కన్జర్వేటివ్ సభ్యులు కూడా పాల్గొనడం గమనార్హం.
యోన్ వాదన ఏంటి?
కాగా, తాను తీసుకువచ్చిన మార్షల్ లా కేవలం ప్రతిపక్షాల దూకుడును కట్టడి చేసేందుకేనని.. తాను తప్పు చేయలేదని ప్రస్తుతం అభిశంసనకు గురైన అధ్యక్షుడు యోన్ పేర్కొన్నారు. తాను ప్రతిపక్షాలపై యుద్ధం చేస్తూ.. దేశాన్ని సుస్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. తను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతం కాదన్న ఆయన.. ఇది పాలనలో ఒక భాగమేనని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనానికి తన వాదనను వినిపిస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే.. రాజ్యాంగ ధర్మాసనం.. కేవలం తీర్మానం సరిగా చేశారో లేదో మాత్రమే పరిశీలిస్తుందని.. ఎవరి వాదనను పరిగణనలోకి తీసుకోదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
This post was last modified on December 15, 2024 10:18 am
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…