Trends

మనోవర్తి ఎలా డిసైడ్ చేయాలో తేల్చిన సుప్రీం

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విడాకుల వేళ.. భార్యకు భర్త చెల్లించాల్సిన శాశ్విత మనోవర్తిని డిసైడ్ చేసేందుకు కీలక తీర్పును వెలువరించటమే కాదు.. మనోవర్తిని డిసైడ్ చేసేందుకు 8 మార్గదర్శకాల్ని జారీ చేసింది. వీటిని అనుసరించి మనోవర్తి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయాలని పేర్కొంది. భర్త చెల్లించాల్సిన మనోవర్తిని అతడిని శిక్షించే విధంగా ఉండకూదని పేర్కొంది.

అదే సమయంలో అతడి జీవిత భాగస్వామిగా వ్యవహరించిన మహిళ విడాకుల అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి 8 సూత్రాలను డిసైడ్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాత్.. జస్టిస్ ప్రసన్న.. జస్టిస్ బి వరాలే ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

దేశంలోని ఇతర విడాకుల కేసులకు సంబంధించి మార్గర్శకంగా ఉండే అంశాలకు కారణమైన కేసు విషయంలోకి వెళితే.. ఒక జంట ఆరేళ్లు కలిసి ఉంది. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లు విడిగా జీవించారు. చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది మనోవర్తి నిర్ధారించే సమయంలో గమనించాల్సిన అంశాలకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది. అంతేకాదు మనోవర్తి నిర్దారణకు కచ్ఛితమైన సూత్రాలు ఏమీ ఉండవని చెప్పింది. అంతేకాదు.. తాము జారీ చేసిన మార్గదర్శకాల్ని అన్ని కోర్టులు పాటించాలని తెలిపింది.
సుప్రీం జారీ చేసిన 8 మార్గదర్శకాలు ఇవే..

  • భార్య.. భర్తల ఆర్థిక సామాజిక హోదా
  • భార్య.. ఆమెపై ఆధారపడ్డ పిల్లల హేతుబద్ధమైన అవసరాలు
  • భార్యభర్తల విద్యార్హతలు.. ఉద్యోగాల హోదా
  • భార్యకు ఉన్న సొంత ఆదాయం.. ఆస్తులు
  • అత్తింటివారిలోభార్య అనుభవించిన జీవన ప్రమాణాలు
  • కుటుంబ బాధ్యతల కోసం ఆమె ఉద్యోగాన్ని త్యాగం చేసి ఉంటే ఆ వివరాలు
  • భార్య ఎలాంటి జాబ్ చేయకుంటే కోర్టుల్లో కేసు కోసం ఆమె చేసిన ఖర్చు
  • భర్త ఆదాయం.. అప్పులు.. మనోవర్తి భారం.. తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి.

This post was last modified on December 13, 2024 9:42 am

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

5 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

5 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

6 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

8 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

8 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

8 hours ago