వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం ఊహించని రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న ప్రసిద్ధ గాయని టేలర్ స్విఫ్ట్ ఇటీవల సంచలన రికార్డును సొంతం చేసుకుంది. లైవ్ కాన్సర్ట్ లకు ఆదరణ కరువైందని వస్తున్న కామెంట్స్ కు ఇది పవర్ఫుల్ ఆన్సర్ అని చెప్పవచ్చు. తన ‘ఎరాస్ టూర్’ ద్వారా ఆమె ప్రపంచ సంగీత రంగాన్ని కుదిపేసింది. ఈ టూర్ ద్వారా టేలర్ స్విఫ్ట్ $2,077,618,725 (సుమారు ₹17,000 కోట్ల) టికెట్ విక్రయాలను సాధించి, గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించింది.
టేలర్ స్విఫ్ట్ ప్రొడక్షన్ కంపెనీ ‘టేలర్ స్విఫ్ట్ టూరింగ్’ ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్‌తో పంచుకుంది. ఇది గతంలో ఎవరు అందుకోలేనంత అతిపెద్ద రికార్డు. టాప్ టూర్స్ టికెట్ విక్రయాలకంటే రెండింతలు ఎక్కువగా ఉందని విశ్లేషకులు తెలిపారు. 20 నెలల పాటు సాగిన ఈ టూర్ ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రదర్శనలకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
సంగీత ప్రియులు స్విఫ్ట్ ప్రదర్శనలకు ఉత్సాహంగా హాజరై, టికెట్ విక్రయాల్లో రికార్డు స్థాయికి తీసుకెళ్లారు. ఈ టూర్‌లో ప్రదర్శించిన విశేషమైన స్టేజింగ్, మ్యూజిక్, వందలాది కళాకారుల భాగస్వామ్యం టేలర్ స్విఫ్ట్ క్రియేటివిటీని మరో మారు నిరూపించింది. ఈ టూర్ ద్వారా టేలర్ స్విఫ్ట్ తన సంగీతానికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
హాలీవుడ్ సినిమాల స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్ల మాదిరిగా ఆమెకు ఆదాయం పెరిగింది. ఈ రికార్డు సంగీత రంగానికి కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. అలాగే లైవ్ కాన్సర్ట్ పరిశ్రమలో భారీ మార్పుకు దారితీస్తుందని చెప్పవచ్చు. టేలర్ స్విఫ్ట్ టూరింగ్ కంపెనీ ఈ టూర్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ రికార్డుతో టేలర్ స్విఫ్ట్ కు బారి బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. గత ఐదేళ్ల కంటే ఇప్పుడు ఒక్క యేడాదికే ప్రస్తుత సంపద డబుల్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 12, 2024 3:02 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…