నితీష్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్న తెలుగు క్రికెటర్ పేరిది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్.. తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విలువైన పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఎనిమిది నెలల ముందు అనామకుడైన ఈ క్రికెటర్ ఇప్పుడు ప్రతిష్టాత్మక సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని.. జట్టు విజయంలో కీలకంగా మారతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన అతను.. ఆల్ రౌండ్ మెరుపులతో అదరగొట్టాడు. తర్వాత భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆడి అక్కడా సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న భారత టెస్టు జట్టులో అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని కూడా అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.తర్వాతి ఐపీఎల్ సీజన్‌కు నితీష్‌ను సన్‌రైజర్స్ అట్టిపెట్టుకుంది. అతడి ధర.. రూ.6 కోట్లు. ఐతే భారత జట్టు తరఫున కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీష్ వేలంలోకి వెళ్లి ఉంటే మినిమం పది కోట్లు పలికేవాడని.. తన రేటు రూ.15 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కానీ నితీష్ మాత్రం తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన సన్‌రైజర్స్‌తోనే కొనసాగాలనుకున్నాడు. తనకు వాళ్లు ఫిక్స్ చేసిన రేటు పట్ల సంతృప్తి చెందాడు. వేలంలోకి ఎందుకు వెళ్లలేదని తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో నితీష్‌ను అడిగితే.. తనకు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంఛైజీకి ఆడడమే ఇష్టమని.. ఇక్కడి ఫ్యాన్స్ తనను ఎంతగానో ఆదరించారని.. వాళ్ల మధ్య మన లోకల్ ఫ్రాంఛైజీకి ఆడడంలో ఉన్న ఆనందం వేరని.. వేలంలోకి వెళ్తే వేరే జట్టుకు వెళ్లిపోతానేమో అనిపించి సన్‌రైజర్స్‌తో కొనసాగడానికే తాను మొగ్గు చూపానని నితీష్ తెలిపాడు. మొత్తానికి లోకల్ ఫీలింగ్‌తో నితీష్ కోట్లు వదులకోవడం గొప్ప విషయమని తెలుగు నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on December 1, 2024 4:18 pm
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా…