ఐపీఎల్ 2025 వేలంలో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలి పోవడం చర్చనీయాంశంగా మారింది. 2018లో అండర్-19 వరల్డ్‌కప్ గెలిపించిన కెప్టెన్‌గానే కాకుండా, భారత క్రికెట్‌కు భవిష్యత్ సచిన్ గా భావించబడిన షా, ఐపీఎల్ వేలంలో 75 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగినా, ఎలాంటి ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు. ఈ పరిణామం క్రికెట్ అభిమానుల్లో కాస్త నిరాశను కలిగించింది. 2018 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా, గత రెండు సీజన్లలో ఫామ్ కోల్పోవడం, నిలకడ లేమితో జట్టు నుంచి తప్పించబడ్డాడు.
ఫిట్నెస్, ప్రదర్శనపై నిర్లక్ష్యం కారణంగా షాపై నమ్మకం కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని వేలంలో ఉంచి వదిలేసింది. ఏ జట్టు కూడా అతడిని కొనుగోలు చేయకపోవడం షా కెరీర్‌లో అతిపెద్ద ఎదురుదెబ్బగా భావించబడుతుంది. పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలి పోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ స్పందిస్తూ, షా ప్రతిభగల ఆటగాడని, కానీ అతడు తనకు తానే సమస్యల్ని కల్పించుకున్నాడని పేర్కొన్నారు.
“ఇలాంటి ఎదురుదెబ్బలు అప్పుడప్పుడు అవసరం. ఈ దెబ్బలు అతడిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తాయి,” అని జిందాల్ అన్నారు. మరోవైపు, మొదట్లో అతడిని సచిన్, లారా వంటి దిగ్గజాలతో పోల్చడమే అతడి ఎదుగుదలకు ఆటంకంగా మారిందని జిందాల్ అభిప్రాయపడ్డారు. ముంబై క్రికెట్‌కు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలను అందించిన నేపథ్యంతో, పృథ్వీషాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబై క్రికెట్ సర్కిల్స్‌లో అతడి పేరే చర్చనీయాంశమని జిందాల్ గుర్తు చేశారు. అయితే, ఇవే అంచనాలు అతడిపై ఒత్తిడిగా మారాయని, ఈ తీరును షా త్వరగా అధిగమించాలని ఆకాంక్షించారు.
షా కెరీర్ మొదట్లో చూపించిన మెరుపులు మళ్లీ చూడగలమా అనే ప్రశ్నకు జిందాల్ తన మాటలతో సమాధానం ఇచ్చారు. “పతనాల నుంచే పురోగతికి బాటలు పడతాయి. షా తన ప్రతిభను పునరుద్ధరించుకునే అవకాశాలను వదులుకోకూడదు,” అని అన్నారు. పృథ్వీషా ఎదురుదెబ్బలను జీర్ణించుకొని, క్రికెట్‌కు మరింత కష్టపడితే అతడు తిరిగి వెలుగులోకి వస్తాడని నిపుణులు విశ్వసిస్తున్నారు.
This post was last modified on November 29, 2024 5:38 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…