ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్ షిప్టులో పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా నైట్ షిప్టులు చేసే ఉద్యోగులు..పని చేస్తున్న సమయంలో ఓ చిన్న కునుకు వేయడం సహజం. చాలా కంపెనీలు కునుకు వేసే ఉద్యోగులను చూసీచూడనట్లు వదిలేస్టుంటాయి. కానీ, చైనాలోని ఓ కంపెనీ మాత్రం కునుకు వేసిన ఉద్యోగిపై వేటు వేసింది.
దీంతో, తన ఉద్యోగం పోయిందంటూ బాధిత ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో, సదరు కంపెనీకి 3.5 లక్షల యువాన్లు (దాదాపు రూ. 40.78 లక్షలు) ఫైన్ వేసింది కోర్టు. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైజింగ్ లోని ఓ కెమికల్ కంపెనీలో ఝాంగ్ 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కంపెనీలో నిబద్ధత గల ఉద్యోగిగా ఆయనకు పేరుంది. ఓ ఫైన్ డే నైట్ డ్యూటీ చేస్తున్న ఝాంగ్ తన డెస్క్‌పైనే చిన్న కునుకు తీశాడు.
సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో కొంపలు మునిగిపోయాయి అన్నట్లు హెఆర్ డిపార్ట్ మెంట్ ఫైర్ అయింది. గంటపాటు నిద్రపోయాడంటూ ఉద్యోగం నుంచి ఫైర్ చేసింది. నిద్రపోవడం కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందకు వస్తుందని నోటీసులిచ్చి ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం కోల్పోయిన ఝాంగ్.. తనను అన్యాయంగా తొలగించారంటూ కోర్టును ఆశ్రయించాడు. అయిత, నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి పీకేస్తారా అని కోర్టు ఆ కంపెనీకి చివాట్లు పెట్టి 40 లక్షల రూపాయల ఫైన్ వేసింది. కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమీ జరగలేదని చురకలంటించింది. బైజింగ్ లోని పీపుల్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 25, 2024 12:32 pm
2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన చిరుత మూవీతో తెలుగు సినీ…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…
వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం…