ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతోంది. ఎడారి దేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ తొలి రోజు 84మంది ప్లేయర్లు ఆక్షన్ కు వచ్చారు. కొందరు ప్లేయర్లకు కోట్లు కురిపిస్తుంటే మరికొందరికి మొండి చేయి చూపిస్తోంది. ఈ టోర్నమెంటులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోగా, మరికొందరు అంతర్జాతీయ క్రికెటర్లు, భారత ఆటగాళ్లు అసలు అమ్ముడుపోలేదు.
ముఖ్యంగా ప్రపంచ టీ20 క్రికెట్ లో విధ్వంసర బ్యాటర్ గా పేరున్న డేవిడ్ వార్నర్ ను ఏ ఫ్రాంజైజీ కొనేందుకు ఆసక్తి చూపలేదు. అన్ సోల్డ్ం ప్లేయర్ గా డేవిడ్ వార్నర్ మిగిలడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జరిగిన మినీ వేలంలో 6.25 కోట్లకు ఢిల్లీ ఫ్రాంఛైజీ డేవిడ్ వార్నర్ ను కొనుగోలు చేసింది. అయితే, ఈ సారి వార్నర్ పై ఢిల్లీతో పాటు మరే ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐపీఎల్ లో వార్నర్ ఖేల్ ఖతం అయినట్లేనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
ఇక, ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో కూడా అమ్ముడు పోలేదు. టీ20 క్రికెట్ స్పెషలిస్ట్ గా పేరున్న బెయిర్ స్టోను కొనేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. వికెట్ కీపర్/ విధ్వంసకర బ్యాట్స్ మన్ అయిన బెయిర్ స్టోను ఏ జట్టు కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ కూడా అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. గత వేలంలో 7.75 కోట్లు పలికిన దేవదత్ ను కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. ప్రస్తుతం పడిక్కల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోని తొలి టెస్టులో ఆడుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 24, 2024 10:55 pm
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…
కనివిని ఎరుగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టరయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన…
టాలీవుడ్ లో అత్యంత బిజీగా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రష్మిక…
పుష్ప 2 ది రూల్ నేపధ్య సంగీతం ఇతరులకు వెళ్ళిపోయిన నేపథ్యంలో చెన్నైలో జరిగే కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్…
ఇన్స్టాగ్రామ్ లో తన క్యూట్ ఫొటోస్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ ఆషికా రంగనాథ్. 2023లో కళ్యాణ్ రామ్…