ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా రాలేదనేది అందరికీ తెలిసిందే. 2014లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, చివరి దశలో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి పంజాబ్ పునరాగమనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ కనీసం టాప్ 5లో నిలవడం లేదు. ఇక ఆ జట్టులో ప్రధాన లోపం కెప్టెన్ గా సరైన ఆటగాడు లేకపోవడమే. అందుకే ఈ సారి పంజాబ్ యాజమాన్యం, ముఖ్యంగా ప్రీతి జింటా, స్ట్రాటజీని పూర్తిగా మార్చి, బలమైన నాయకత్వం కోసం శ్రేయస్ అయ్యర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి అందరికి షాక్ ఇచ్చారు. తొలుత కోల్‌కతా, ఆపై ఢిల్లీ జట్లతో పోటీ పడిన పంజాబ్ చివరకు శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకుంది. అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు కెప్టెన్‌గా సేవలందించాడు. కెప్టెన్సీ అనుభవం, బ్యాటింగ్ నైపుణ్యం వల్ల పంజాబ్ బలమైన జట్టుగా మారేందుకు అయ్యర్ కీలక పాత్ర పోషించనున్నాడు.
ఢిల్లీని 2020లో ఫైనల్స్ వరకు తీసుకు వెళ్ళాడు. అలాగే 2024లో సీజన్‌లో కోల్‌కతా జట్టును ఫైనల్ లో గెలిపించిన కెప్టెన్ గా గుర్తింపు అందుకున్నాడు. అతడి గేమ్ స్ట్రాటజీలు, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే గుణం, ఇన్నింగ్స్‌ని సమర్థంగా నిర్మించగలిగే సామర్థ్యం పంజాబ్‌ను ఈ సారి విజయ దిశగా నడిపిస్తుందని ఆశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ గత సీజన్లలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసినా, స్థిరమైన ప్రదర్శనను చూపలేకపోయింది.
కెప్టెన్సీ మార్పులు, ఆటగాళ్ల గాయాలు, పుంజుకోలేని మిడిలార్డర్ సమస్యలు జట్టును వెనుకకు లాగాయి. ఇది చూసి, ఈ సారి శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్‌గా ఎంచుకుని పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగేందుకు యాజమాన్యం సిద్ధమైంది. అయ్యార్ నాయకత్వంలో, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరచి, బౌలింగ్ విభాగానికి సరైన మార్గదర్శకత్వం అందించగలదని నమ్ముతున్నారు. మరి ప్రీతి జింటా ఈ సారి తన కలల ట్రోఫీని అందుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on November 24, 2024 6:36 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…