టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో పంత్ కోసం ఫ్రాంచైజీలు గట్టి పోటీ చేశారు. ఈ పోటీని లక్నో సూపర్ జెయింట్స్ కైవసం చేసుకుంది. ఎల్ఎస్ జీ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. పంత్‌ను దక్కించుకోవడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం పోటీకి దిగింది.
అయితే రేటు భారీ స్థాయికి చేరడంతో చివరికి సన్‌రైజర్స్ వెనక్కు తగ్గింది. ఇంత భారీ ధరతో రిషబ్ పంత్‌ను లక్నో తమ జట్టుకు చేర్చుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడికి లభించని అత్యధిక రేటు. నేటి వేలంలో రెండు కీలక రికార్డులు బద్దలయ్యాయి. తొలుత ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల రికార్డు నెలకొల్పగా, తర్వాత శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించాడు. కానీ ఈ రికార్డును రిషబ్ పంత్ కేవలం గంటల వ్యవధిలోనే అధిగమించాడు. పంత్ ధరకు సంబంధించిన వార్త క్రికెట్ అభిమానుల్లో సంచలనంగా మారింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల తాలూకు వ్యూహాలు, భారీ ఖర్చులు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పంత్ బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ కీపింగ్ ప్రతిభ కలిపి ఈ రేటుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ రికార్డు ధరతో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో కీలక పాత్ర పోషించనున్నాడని లక్నో యాజమాన్యం ఆశిస్తోంది. ఈ భారీ పెట్టుబడి లాభసాటిగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్ వరకు ఢిల్లీ జట్టులో ఉన్న పంత్ యాజమాన్యంపై అసహనంతోనే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on November 24, 2024 6:06 pm
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…