భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఆడతాడని.. టీమ్ ఇండియా జెర్సీలో కనిపిస్తాడని చాలామంది ఊహించలేదు. రెండేళ్ల కిందట అతడికి అంత పెద్ద ప్రమాదం జరిగింది. 2022 డిసెంబరులో తెల్లవారుజామున ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు తనే కారు డ్రైవ్ చేసుకుని వెళ్తుండగా.. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడం.. పంత్ తీవ్ర గాయాలతో కారులో చిక్కుకుపోవడం.. మంటలు చెలరేగి కారు దగ్ధమైపోతున్న దశలో ఎవరో అది చూసి పంత్‌ను బయటికి లాగడం.. చకచకా జరిగాయి.
ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే పంత్.. ఆ మంటల్లో కాలిపోయేవాడు. పంత్‌ను బయటికి తీసి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతడి ప్రాణం నిలిచింది. కానీ తీవ్ర గాయాలతో అతను ఆరు నెలల పాటు మంచం దిగలేదు. అనేక సర్జరీల తర్వాత అతను కోలుకున్నాడు. ఆపై నెమ్మదిగా సాధన చేసి 15 నెలల విరామం తర్వాత ఆటలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు.ఆ ప్రమాదంలో రజత్, నిషు అనే కుర్రాళ్లు పంత్ ప్రాణాన్ని కాపాడారు. ప్రమాదం జరిగిన దగ్గర్లోనే వీళ్లిద్దరూ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వాళ్లు అప్రమత్తం కాకపోయి ఉంటే పంత్ అనేవాడు ఉండేవాడు కాదు.
ఆ రోజు వాళ్లిద్దరూ చేసిన సాయాన్ని గుర్తుంచుకుని పంత్.. ఇద్దరికీ బైకులు కొని ఇచ్చాడట. వాటి మీదే ఇప్పుడు ఆ ఇద్దరూ తిరుగుతున్నారు. రజత్, నిషులకు పంత్ కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‌తో పునరామగనం చేసిన పంత్.. ఢిల్లీ తరఫున బాగానే ఆడాడు. ఆపై టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసి టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆడుతున్నాడు. ఈ రోజు, రేపు జరగనున్న ఐపీఎల్ వేలంలో అతడికి భారీ ధర పలుకుతుందనే అంచనాలున్నాయి.
This post was last modified on November 24, 2024 2:04 pm
ఇంగ్లండ్‌పై టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న బ్రహ్మ ఆనందం ప్రమోషన్ల పరంగా అన్ని చేస్తున్నా ఒక బలమైన పుష్ కోసం ఎదురు…
కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్…
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ…