పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టీమిండియా ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. 5 పరుగుల వద్ద జైశ్వాల్ డకౌట్ అవగా, దేవదత్ పఠికల్ 14 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కోహ్లీ కూడా కేవలం 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు.
ఇక ఇదే తరుణంలో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔట్ నిర్ణయం వివాదాస్పదమైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ అయ్యారన్న కారణంగా థర్డ్ అంపైర్ రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు, అయితే ఈ నిర్ణయంపై పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇన్ స్వింగర్ బంతిని రాహుల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బంతి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లోకి వెళ్లింది.
స్టార్క్, కీపర్ అప్పీల్ చేయగా ఆన్‌ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్‌గా తీర్పు ఇచ్చాడు. అయితే ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెంటనే కీపర్ తో చర్చించి రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ రిప్లేను పరిశీలించాడు. రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పైక్ కనిపించినా, బ్యాట్‌తో పాటు ప్యాడ్‌ను తాకినప్పుడు శబ్దం వచ్చినట్లు అనుమానం తలెత్తింది. స్పష్టమైన ఫుటేజ్ లేకపోయినా, థర్డ్ అంపైర్ రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం రాహుల్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.
మరో యాంగిల్‌ను పరిశీలించకపోవడం తనకు అన్యాయంగా అనిపించిందని రాహుల్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. బంతి నిజంగా బ్యాట్‌ను తాకిందా లేక ప్యాడ్‌ను తాకిందా అన్న విషయంపై స్పష్టత లేకపోయినా, ఔట్ ప్రకటించడం వివాదానికి దారితీసింది. రాహుల్ నిరాశగా మైదానాన్ని వీడినప్పుడు భారత అభిమానులు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీక్షకులు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలు తెలిపారు. “అస్పష్టత ఉన్న సందర్భంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని కొనసాగించడం థర్డ్ అంపైర్ బాధ్యత. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది” అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
This post was last modified on November 22, 2024 12:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…