ఇండియన్ ఫుట్ బాల్ అభిమానులకు ఇది గొప్ప వార్త. ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలోనే భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. అర్జెంటీనా జట్టు భాగస్వామ్యంతో కేరళ రాష్ట్రంలో ఒక చారిత్రక అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ విషయాన్ని కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దురహిమన్ బుధవారం స్పష్టం చేశారు.
మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, అర్జెంటీనా జట్టు తమ రాష్ట్రంలో మ్యాచ్ ఆడేందుకు సానుకూలంగా స్పందించిందని, లియోనెల్ మెస్సీ సహా అర్జెంటీనా జట్టులోని స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం కేరళ ఫుట్ బాల్ ప్రియులకు ఒక గుర్తుండిపోయే అనుభవంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ చారిత్రాత్మక మ్యాచ్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం స్థానిక వ్యాపారులు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారని వివరించారు. కేరళలోని ప్రఖ్యాత స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మ్యాచ్ తేదీ, టికెట్ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడు భారత గడ్డపై మ్యాచ్ ఆడడం అరుదైన విషయం. ఇక అర్జెంటీనా జట్టు రాకతో కేరళలో ఫుట్ బాల్ ఉత్సాహం మరింత పెరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెస్సీ అభిమానులు ఇప్పటికే ఈ సమాచారం తెలుసుకుని ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో మెస్సీ రాకపై అభిమానుల చర్చలు ఊపందుకున్నాయి. కేరళలో జరిగే ఈ మ్యాచ్ దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులకు మర్చిపోలేని సందర్భంగా నిలిచే అవకాశం ఉంది.
This post was last modified on November 20, 2024 2:50 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…