ఐపీఎల్ 2025 మెగా వేలం క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ జట్టులో కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ ఈసారి వేలానికి వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. కీపర్ + బ్యాట్స్ మెన్ కావడంతో అతని ధర 20 కోట్లకు పైనే ఉండవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. అందులోనూ కెప్టెన్ గా అనుభవం ఉన్న ఆటగాడు కాబట్టి ఢిల్లీ, పంజాబ్ లాంటి జట్లు వేలంలో ఆతనిపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో జరిగే మెగా వేలంలో పంత్‌ను ఏ జట్టు తనదిగా చేసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీ యాజమాన్యం రిషబ్ పంత్‌ను రిటైన్ చేయకపోవడానికి పలు కారణాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రిటెన్షన్ కోసం పంత్ ఎక్కువ ఫీజు కోరాడని, అది ఫ్రాంచైజీకి ఆమోదయోగ్యం కాలేదని పలువురు అనుకుంటున్నారు.
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా ఇదే తరహాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అలాగే ఢిల్లీ ఫ్రాంచైజీ పంత్‌ను వేలంలోనే తిరిగి కొనుగోలు చేయాలని చూస్తుందని ఎందుకంటే వారు కొత్తగా కెప్టెన్‌ను వెతుక్కోవడం కష్టమైన విషయం..అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షోలో తెలిపారు. ఇక సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రిషబ్ పంత్ స్వయంగా స్పందించాడు. “నా రిటెన్షన్ విషయంలో డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు. అదే కచ్చితంగా చెప్పగలను” అంటూ గావస్కర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.
అయితే విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం పంత్ భయటపెట్టలేదు. పంత్ సమాధానం క్రికెట్ అభిమానుల మధ్య చర్చలకు దారితీసింది. ఇక మరోవైపు వేలంలో రిషబ్ పంత్‌ను దక్కించుకోవడానికి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పోటీ పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, పంత్ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా నిలవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on November 20, 2024 7:07 am
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల…
భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.…
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యల మధ్య కూడా దేశం కోసం తన బాధ్యతలను నిర్వర్తించిన వైనం నిజంగా…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఉన్న గ్యాప్‌ను దాదాపు తగ్గించుకునే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ…