కోడి ముందా? గుడ్డు ముందా? అనేది ఇప్పటి వరకు తర్కానికి అందని చిక్కు ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే గుడ్డులో నుంచేకోడి వస్తుంది.. కాబట్టి గుడ్డు ముందు.. అని తీర్మానం చేయాలంటే.. అసలు కోడి లేకుండా గుడ్డు ఎక్కడ నుంచివచ్చింది? అనేది వెంటనే తెరమీదికి వచ్చే ప్రశ్న. దీంతో అసలు సమాధానం దొరకని ప్రశ్నగానే ఇది శతాబ్దాలుగా ఉండిపోయింది. అంతేకాదు.. సామెతగా కూడా.. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉండిపోయింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్నవాళ్లు సలహా ఇస్తే.. నువ్వు ముందా? నేను ముందా? అనే విధంగా ఈ సామెతను వినియోగించడం పరిపాటిగా మారింది.
అయితే.. ఇప్పుడు ఈ తర్కానికి కూడా శాస్త్రవేత్తలు ఆన్సర్ చెప్పేశారు. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే..గుడ్డే ముందని తేల్చేశారు శాస్త్రవేత్తలు. దీనికి కారణం.. పురాతన ఏకకణ జీవులను పరిశీలించినప్పుడు.. ఆయా కణాల్లో గుడ్డు లక్షణాలు కనిపించాయి. దీంతో గుడ్డే ముందు ఉండి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఎలా గుర్తించారు?
కణ విభజన చేసినప్పుడు జంతువుల పిండాన్ని పోలి ఉండే కణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది.. పూర్వ ఏకకణ జీవిలో ఉందని గుర్తించారు. ఈ క్రమంలోనే జంతువుల పరిణామానికి ముందు పిండం(గుడ్డు) అభివృద్ధి చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన పురాణాలు కూడా.. అండమే(గుడ్డు) ముందు జనించిందని చెబుతుండడం గమనార్హం. ప్రధానంగా భూమి అండాకారంలో ఉందని వేదమే చెబుతోంది. దీనిలో నుంచే వివిధ రూపాలు జనించాయన్నది శాస్త్రం చెబుతున్న మాట.
ఇక, శాస్త్రవేత్తలు తొలుత భూమి గోళాకారంగా ఉందని భావించినా.. తర్వాత అండాకారంలో ఒకవైపు(ఉత్తరం వైపు) నొక్కబడి ఉందని గుర్తించారు. సో.. సృష్టి పరిణామం కూడా అండం నుంచే మొదలైందన్న భావనకు మద్దతు లభించింది. ఇప్పుడు కోడి ముందా? గుడ్డు ముందా? అన్న తర్కంలోనూ బహుశ ఈ సూత్రమే పనిచేసి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి సుదీర్ఘ కాలంగా ఉన్న చిక్కు ప్రశ్నకు కణ శాస్త్ర వేత్తలు(సెల్యూలర్ సైంటిస్ట్స్) సమాధానం చెప్పడం విశేషం.
This post was last modified on November 20, 2024 11:24 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…