అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) గత ఐదు నెలలుగా ఉంటున్నారు. వీరిని తిరిగి భూమికి తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ వాహన నౌక సాంకేతిక లోపాల కారణంగా మిషన్ వాయిదాపడింది. నాసా ప్రకారం, వచ్చే ఫిబ్రవరి వరకు వీరు అంతరిక్ష కేంద్రంలోనే కొనసాగనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో ఎలా జీవిస్తున్నారు, ఏమి తింటున్నారు అన్నదానిపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన చిత్రాల్లో సునీతా విలియమ్స్ కాస్త బలహీనంగా కనిపించడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. ఐఎస్ఎస్‌లో వీరికి అందించబడే ఆహారం గురించి నాసా కొన్ని వివరాలు వెల్లడించింది. సునీతా విలియమ్స్, విల్మోర్ పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యల కాక్‌టెయిల్స్ వంటి వంటకాలను తింటున్నారు.
దీనితో పాటు తక్కువ మొత్తంలో తాజా పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి నాసా పంపుతుంటుంది. ప్రత్యేక ప్యాకింగ్ చేయబడిన ఈ పదార్థాలు గడ్డకట్టిన లేదా ఎండిన స్థితిలో ఉంటాయి. అంతరిక్ష కేంద్రంలో ఆహారం తినడానికి అవసరమైన వాటిని స్పెషల్ ట్రేలలో అందిస్తారు. మాంసం, గుడ్లు వంటి పదార్థాలు భూమిపైనే వండుతారు, వాటిని అక్కడి ఫుడ్ వార్మర్‌లో మళ్లీ వేడి చేసుకుని తింటారు. డీహైడ్రేటెడ్ సూప్‌లు, క్యాసరోల్స్‌ల కోసం కావలసిన నీటిని ఐఎస్ఎస్‌లోని ప్రత్యేక నీటి ట్యాంక్‌ల నుంచి అందిస్తారు. వీరి ఆహారం శారీరక అవసరాలకు అనుగుణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, నాసా వైద్యులు ప్రతి రోజు వీరి ఆహారంలో సరిపడే కేలరీలు ఉంటున్నాయా లేదా అన్నది నిర్ధారించుకుంటారు. ఈ చర్యల వల్లే వ్యోమగాములు అంతరిక్షంలో సురక్షితంగా ఉండగలుగుతున్నారు. ఐఎస్ఎస్‌లో వీరి సాహసయాత్ర ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగనుంది. ఈ మిషన్ సాంకేతిక సమస్యలను అధిగమించి విజయవంతం అవుతుందని నాసా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
This post was last modified on November 19, 2024 3:25 pm
జీ20 సదస్సు సందర్భంగా బ్రెజిల్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్తో కీలక సమావేశం…
ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల…
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన వర్మ…
ఇండియన్ సినిమా బడ్జెట్లను, వసూళ్లను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. పదేళ్ల కిందటే ఈ సినిమా మీద రూ.250…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కడప దర్గాకు రావడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇక్కడికి సెలబ్రెటీస్…
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ అరెస్టు దేశ రాజకీయాలలో సైతం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.…