Trends

ట్రంప్ గెలుపు.. హ‌ద్దులు దాటేసిన మ‌స్క్‌ ఆదాయం

ఎలాన్ మ‌స్క్‌.. టెస్లా కార్ల కంపెనీ అధినేత‌గానే కాదు.. ట్విట్ట‌ర్ దిగ్గ‌జం, స్పేస్ ఎక్స్(అంత‌రిక్ష కేంద్రం) వంటి అనేక వ్యాపాల‌తో ఆయ‌న దూసుకుపోతున్నారు. ప్ర‌పంచ కుబేరుడిగా కూడా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే.. ఆయ‌న ఆదాయం ఇప్పుడు మ‌రిన్ని రెట్లు పెరిగింది. అస‌లు హ‌ద్దులు దాటిపోయింద‌నే అంటున్నాయి వాణిజ్య వ‌ర్గాలు. దీనికి కార‌ణం.. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల్లో మ‌స్క్ ఆది నుంచి కూడా.. రిప‌బ్లిక‌న్ పార్టీ నాయ‌కుడు, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను స‌మ‌ర్థిస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం స‌మ‌ర్థ‌నే కాదు.. ఆయ‌నే ట్రంప్ ను గెలిపించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే వారానికి కోట్ల రూపాయ‌ల చొప్పున ఎన్నిక‌ల విరాళాలు విర‌జిమ్మారు. అక్క‌డితోనూ ఆగ‌లేదు.. త‌న ఎక్స్‌ ఖాతాను.. కేవ‌లం ట్రంప్ అనుకూల ప‌రివారానికి మాత్ర‌మే ప‌రిమితం చేశారు. ట్రంప్ ప్ర‌త్య‌ర్థులు డెమొక్రాట్లకు అస‌లు ఎక్స్‌లో చోటు క‌ల్పించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. అదేస‌మ‌యంలో ఏఐ(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌)ను ఉప‌యోగించి. ఎక్స్‌లో ట్రంప్‌-మ‌స్క్‌లు చేసిన ప్ర‌చారం దుమ్మురేపింది. నిరంత‌రం.. ఏదో ఒక వినూత్న‌ను ప్ర‌ద‌ర్శించిన మ‌స్క్‌.. ఆద్యంతం కూడా ట్రంప్ కోసం ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. ఒకానొక ద‌శ‌లో డెమొక్రాట్ల‌ను స‌మ‌ర్థిస్తున్న ‘గూగుల్‌కే’ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

అంతేకాదు.. ఈవీఎంల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. కోర్టుకు కూడా వెళ్లి.. దీనిని ర‌ద్దు చేయించి.. బ్యాలెట్‌ను తీసుకువ‌చ్చే విష‌యంలో మ‌స్క్ చాల‌నే ఇబ్బందులు ప‌డ్డారు. అయినా.. త‌న ఫ్రెండ్‌, పార్ట‌న‌ర్ ట్రంప్ కోసం.. ఆయ‌న ఎన్నో చేశారు. చివ‌ర‌కు మ‌స్క్ త‌న త‌ల్లిని కూడా మీడియా ముందుకు తీసుకువ‌చ్చారు. ట్రంప్‌కు అనుకూలంగా ప్ర‌చారం చేయించారు. ఇలా .. త‌న‌దైన శైలిలో మ‌స్క్ ట్రంప్‌కు అన్ని విధాలా సాయం చేశారు. ఇక‌, ఇప్పుడు మ‌స్క్ అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరింది. ట్రంప్ ఘ‌న విజ‌యం సాధించారు.

ఎలా పెరిగాయి?

ట్రంప్ విజ‌యంతో మ‌స్క్ వ్యాపారాల‌కు తిరుగులేద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా అంత‌ర్జాతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించేందుకు ట్రంప్ స‌ర్కారు ఎలాంటి అడ్డంకులు లేని విధానాన్ని మ‌స్క్‌కోసం తెచ్చినా ఆశ్చ‌ర్యం లేదు. దీంతో మ‌స్క్ వ్యాపారాల‌న్నీ.. స్టాక్ మార్కెట్ల‌లో ఒక్క‌సారిగా పుంజుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న‌వ‌న్నీ.. లాభాల జోష్‌లో కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. మ‌స్క్ చేసిన సాయం.. త‌న‌కు ఎవ‌రూ చేయ‌లేద‌ని.. ట్రంప్ చెప్ప‌డం.. గ‌మ‌నార్హం. అంతేకాదు.. మ‌స్క్‌కు తాను రుణ ప‌డిపోతాన‌ని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల అనంత‌రం మ‌స్క్ వ్యాపార సామ్రాజ్యం పుంజుకోవ‌డం మ‌రో విశేషం.

This post was last modified on November 7, 2024 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

54 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

4 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

5 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

5 hours ago