బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులు ప్రస్తుతం దాడుల బెడదను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా హిందూ సముదాయం పై జరగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిస్థితుల్లో, తమకు భద్రత కల్పించాలని కోరుతూ బంగ్లాదేశ్‌లోని ఛాటోగ్రామ్ నగరంలో పెద్ద ఎత్తున ఉగ్ర నిరసన వ్యక్తం చేశారు.
హిందూ సముదాయానికి చెందిన 30,000 మంది ఒకేసారి రోడ్డెక్కారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. హింసను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, మధ్యంతర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ర్యాలీ సమయంలో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.
ప్రజా శాంతిని కాపాడేందుకు పోలీసులు, సైనికులు ఛాటోగ్రామ్‌లో పటిష్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, హింసాత్మక దాడులు, విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి తాత్కాలికంగా భారత్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామా అనంతరం, బంగ్లాదేశ్‌లో తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం దేశంలో శాంతిని నెలకొల్పి, ప్రజాస్వామ్య స్థిరత్వం కోసం చర్యలు చేపడుతుందని అక్కడి సుప్రీం కోర్టు పేర్కొంది.
యూనస్ నేతృత్వంలో ప్రజా వ్యతిరేకత తగ్గినప్పటికీ, మైనారిటీ హిందూ సముదాయంపై జరుగుతున్న దాడులు ఆగడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక హిందూ సంఘాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. గత ఆగస్టు నుంచి ఈ దాడులు మరింత తీవ్రతరం కావడంతో వేలాది మంది హిందువులు దోపిడీ, దాడులు, ఆస్తి నష్టం వంటి ఘటనలను ఎదుర్కొంటున్నారు. పరిస్థితి అదుపులోకి రావాల్సి ఉందని హిందూ నాయకులు పేర్కొన్నారు.
This post was last modified on November 4, 2024 11:29 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…